అభినందన సభ…
మర్రిపాలెం మహారాణివీధి లో జై భీమ్, జై రామ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంట్యాడ చిన అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి వై వి వీడి ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రాష్ట్ర మాదిగ యస్ సి కార్పొరేషన్ ఛైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యే డా||ఉండవల్లి శ్రీదేవి కు అభినందన సభను ఘనంగా నిర్వహించారు. ఆమెకు పూలమాలతో ఘనంగా సత్కరించారు. ముందుగా కోదండ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావ్ ఆశయాలకు తాను ఎప్పుడు కట్టుబడి ఉంటానని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని అన్నారు. ఎస్సీలకు సంక్షేమ పథకాలు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని కొనియాడారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపేట వేసిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు. వైసిపి ప్రభుత్వంలో ఎస్సీలు అణిచివేతకు గురయ్యారని వాపోయారు. జగన్ ఎస్సీలను అనేక రకాలుగా వేధింపులకు గురి చేశారని అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు. ఎస్సీల మనుగడకు తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, మాజీ కార్పొరేటర్ కొప్పల వెంకటరావు, దళిత నాయకులు, జై భీమ్, జై రామ్ సంక్షేమ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.