*బిగ్ బాస్ ఫేమ్ శ్రీజ దమ్ముకు ఆత్మీయ సత్కారం*
*ప్రోత్సాహకుల అభిమానం మరువలేనిది*
*ఆడపులిగా హౌస్ లో గుర్తింపు సంపాదించుకున్న*
*ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు*
అక్కయ్యపాలెం నవంబర్ 4
బిగ్ బాస్ సీజన్ 9 లో ఐదు వారాలకు పైగా తన ఆటపాటలతో మెప్పించిన శ్రీజ దమ్ముకు కుటుంబ సభ్యులు.. సన్నిహితులు ఆత్మీయ సత్కారం నిర్వహించారు.. మంగళవారం అక్కయ్యపాలెం రైతు బజార్ వద్ద సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ లో శ్రీజ దమ్ము అభినందన సభ జరిగింది. శ్రీజ బాబాయ్.. పిన్ని గంట్ల శ్రీనుబాబు సత్యవతి దంపతులు నిర్వహించిన ఈ సభలో శ్రీజ దమ్ము మాట్లాడుతూ తనను బిగ్ బాస్ లో ప్రోత్సహించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.. సాఫ్ట్ వేర్ రంగంలో ఏడాదికి 25 లక్షల వేతనం పొందుతున్న తాను కేవలం బిగ్ బాస్ పై ఫ్యాషన్ తోనే వెళ్లడం జరిగింది అన్నారు.. కామనర్ గా
అగ్నిపరీక్షతోపాటు అనేక ఈవెంట్ లలో విజయం సాధించి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టానన్నారు.. లక్షలాది మంది పోటీ పడినప్పటికీ ఎవరికి రాని అవకాశం తనకు లభించింది అన్నారు. ఐదు వారాలకు పైగా తాను హౌస్ లో కొనసాగానని
ఆ సమయంలో తనకు ఎంతో మంది ఓటు వేసి మద్దతుగా నిలిచారన్నారు.. తెలుగు రాష్ట్రాల లో అనేకమంది ప్రోత్సాహకులు తనను ఆదరించారన్నారు.. తాను బయట ఎలా ఉంటానో బిగ్ బాస్ హౌస్ లో కూడా అదే రీతిన
తన ఆట తీరును ప్రదర్శించాను అన్నారు.. ఆడ పులిగా తనకు గుర్తింపు లభించింది అన్నారు.. అయితే ఎలిమినేషన్ పద్ధతి సరిగ్గా లేకపోయినప్పటికీ తాను ప్రజల హృదయాలను గెలుచుకున్నానని అంతకుమించిన కప్పు మరోటి ఉండదన్నారు.. ఈ సందర్భంగా పలువురు శ్రీజ దమ్మును ఘనంగా సత్కరించారు.. శ్రీజ తండ్రి దమ్ము శ్రీనివాసరావు లావణ్య దంపతులు తన కుమార్తెను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు..కేవలం కుటుంబ సభ్యులు అంతా పాల్గొనీ శ్రీజ దమ్ముకు ఘనంగా సత్కారం చేశారు