ఫైర్, హెల్త్, సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్ విభాగంలో ఉత్తమ సేవలు #vvwnews

by vvwnews.com

ఫైర్, హెల్త్, సేఫ్టీ ఎన్విరాన్‌మెంట్
విభాగంలో ఉత్తమ సేవలు అందించి నందుకు గాను
పూసపాటిరేగకు చెందిన శ్రీను మహంతి సంస్థ ఐఐఎఫ్ఎస్ఈ కు జాతీయ స్థాయి గుర్తింపు లభిం
చింది. ఈ విభాగంలో
ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నేషనల్ అవార్డు 2025ను ఐఐఎఫ్ఎస్ఈ
సొంతం చేసుకుంది.ఈ అవార్డును ముంబైలోని
ద లలిత్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో
సంస్థకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో
దేశంలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ వివరాలను ఐఐఎఫ్ఎస్ఈ డైరెక్టర్ శ్రీను మహంతి డైమండ్ పార్కు సమీప సంస్థ
ప్రాంగణంలో మీడియాకు వెల్లడించారు.21 దేశాలకు సంబందించిన వివిధ సంస్థలు పోటీలో ఉన్నప్పటికీ మా సంస్థకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషం అన్నారు. ఈ విజయానికి ప్రోత్సాహం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. గతంలో అనేక అవార్డులను గెలుచుకున్నట్టు తెలిపారు. 2014లో నెలకొల్పిన తమ సంస్థకు దేశవ్యాప్తంగా 9 మెయిన్ బ్రాంచ్ లు, దాదాపు 32 సబ్ బ్రాంచ్ లు ఉన్నట్టు తెలిపారు. వీటి ద్వారా ఫైర్, హెల్త్, సేఫ్టీలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పన దిశగా విశేష కృషి చేస్తున్నట్టు చెప్పారు.

Use Social Media to Spread the Word about Our News

related articles