ఫైర్, హెల్త్, సేఫ్టీ ఎన్విరాన్మెంట్
విభాగంలో ఉత్తమ సేవలు అందించి నందుకు గాను
పూసపాటిరేగకు చెందిన శ్రీను మహంతి సంస్థ ఐఐఎఫ్ఎస్ఐ కు జాతీయ స్థాయి గుర్తింపు లభిం
చింది. ఈ విభాగంలో
ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నేషనల్ అవార్డు 2025ను ఐఐఎఫ్ఎస్ఐ
సొంతం చేసుకుంది.ఈ అవార్డును ముంబైలోని
ద లలిత్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో
సంస్థకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో
దేశంలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆ వివరాలను ఐ ఐ ఎఫ్ ఎస్ ఈ డైరెక్టర్ శ్రీను మహంతి డైమండ్ పార్కు సమీప సంస్థ
ప్రాంగణంలో మీడియాకు వెల్లడించారు.21 దేశాలకు సంబందించిన వివిధ సంస్థలు పోటీలో ఉన్నప్పటికీ మా సంస్థకు ఈ అవార్డు రావడం ఎంతో సంతోషం అన్నారు. ఈ విజయానికి ప్రోత్సాహం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. గతంలో అనేక అవార్డులను గెలుచుకున్నట్టు తెలిపారు. 2014లో నెలకొల్పిన తమ సంస్థకు దేశవ్యాప్తంగా 9 మెయిన్ బ్రాంచ్ లు, దాదాపు 32 సబ్ బ్రాంచ్ లు ఉన్నట్టు తెలిపారు. వీటి ద్వారా ఫైర్, హెల్త్, సేఫ్టీలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పన దిశగా విశేష కృషి చేస్తున్నట్టు చెప్పారు.
ఫైర్, హెల్త్, సేఫ్టీ ఎన్విరాన్మెంట్ #vvwnews
18