0
పారిశ్రామిక ప్రాంత విలేకరుల సంఘం ఆధ్వర్యంలో మల్కాపురం జంక్షన్ వద్ద నిరసన చేపట్టారు. చిత్తూరులోని విలేకరి ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. విలేకర్ల భద్రత సంక్షేమం ప్రభుత్వం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. సంగం ప్రతినిధులు సుంకర చలపతిరావు, ముప్పిడి గిరి, రాజు, ఎన్ఎస్ఆర్ గుప్తా, ఉదయ్ కుమార్ పలువురు విలేకరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాపురం నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి స్టేషన్లో వినతిపత్రం అందజేశారు.