డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో నిరాశల ఐన రైతులు

by vvwnews.com

*✍️పవన్ కళ్యాణ్ రాకతో నిరాశకు లోనైనా పలువురు రైతులు*

ప్రజాశక్తి కోడూరు

✍️ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తే మా ప్రాంతం బాగుపడుతుంది మా రైతుల సమస్యలు పరిష్కరించి మమ్ములను ఆదుకుంటాడని కొండంత ఆశతో ఎదురుచూసిన కోడూరు మండలం రైతుల ఆశ అడి ఆశ అయినట్ల అయ్యింది పవన్ కళ్యాణ్ రాక,

✍️స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులు రోడ్డు పక్కన ఉన్న వరి పొలాలను చూపించి కేవలం ఒకే రైతు కుటుంబం తో మాట్లాడిస్తే మండల సమస్య అంతా తెలుస్తుందా, మా ఓట్ల అయితే కావాలి కానీ మా సమస్యల గురించి పట్టించుకోరా అని మహిళా రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తు స్థానిక నేతలపై అధికారులపై విరుచుకుపడ్డారు.

✍️మరి కొంతమంది రైతులు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కనీసం మండల కేంద్రమైన కోడూరు కూడా రాకుండా చేశారని, కోడూరు మండలానికి చెందిన వేలాది ఎకరాలు సముద్ర తీరాన ఉంటే కనీసం వాటి గురించి మాట్లాడలేదని, ప్రతి సంవత్సరం ముంపునకు గురవుతున్న వరి పొలాలు గురించి,

✍️శిథిలావస్థలో ఉన్న పాలకాయతిప్ప అవుట్ ఫాల్స్ స్ల్యూయిల్స్ గురించి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్లిన వారు కూడా ఎవరూ లేరని, ఇలాంటి కార్యక్రమాలు పెట్టి రైతులు ఆదుకుంటున్నామని ప్రచారం చేసుకుంటున్నారే తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles