FOREVER MISS INDIA CITY FINAL CROWNING 👑 CEREMONY

by vvwnews.com

ఫరెవర్ మిస్ ఇండియా విశాఖపట్నం 2025 విజేత డాక్టర్ సృజన దేవి

31 ఆగస్టు 2025 : ఫరెవర్ స్టార్ ఇండియా అనేది భారతదేశంలో “ఫరెవర్ మిస్ ఇండియా” పేరిట జాతీయ స్థాయిలో నిర్వహించే ఒక అందాల పోటీ. ఫరెవర్ స్టార్ ఇండియా దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ, ప్రతి ఒక్కరు ఈ పోటీలలో పాల్గోనేందు మరియు రాణించుటకు ప్రోత్సాహం అందిస్తున్నాది. ఈ వేదిక ద్వారా మహిళలకు ఆత్మ విశ్వాసం మరియు వ్యక్తిత్వ వికాసం లక్ష్యంగా వారు ఈ పోటీలలో టైటిల్స్ మరియు కిరీటాలు గెలుపొందే అవకాశాలు కలిగిస్తుంది.

ఈసారి ఫరెవర్ మిస్ ఇండియా- 2025 అందాల పోటీలో డాక్టర్ సృజన దేవి మిస్ విశాఖపట్నం-2025 కిరీటం గెలుపొందిన విజేతగా ఫరెవర్ స్టార్ ఇండియా సగర్వంగా ప్రకటించినది.కేవలం గెలుపొందిన వారిని ప్రకటించటమే కాక వారి వివరాలను గూగుల్ నందు నమోదు చేసి ప్రపంచ వ్యాప్తంగా వారి విజయాలు గుర్తించే విధంగా ప్రోత్సాహం అందిస్తుంది. డాక్టర్ సృజన అంకిత భావంతో పనిచేసే ప్రతిభావంతురాలైన వైద్యురాలు మరియు చక్కని వర్చసు దయాగుణం కలిగి ఉండటమే ఆమెకు ఈ పురస్కారం ఎంపికకు దోహదం చేసాయి. డాక్టర్ సృజన విశాఖ నగర విజేతగా నిలవటమే కాక ఆమె ప్రతిభగూగుల్ నందు కూడ నమోదు చేయబడుతుంది.

ఈ సందర్భంగా ఫరెవర్ స్టార్ ఇండియా డాక్టర్ సృజనా దేవిని అభినందిస్తూ, త్వరలో జైపూర్ నగరంలో జాతీయ స్థాయిలో జరిగే గ్రాండ్ ఫినాలే పోటీలో ఆమె భవిష్యత్తు మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నది. ఈ గ్రాండ్ ఫినలేలో ప్రతి రాష్ట్రం నుండి ఉత్తమంగా నిలిచిన ముగ్గురు కిరీటాలు గెలుపొందుతారు. ఈ పోటీ కోసం డాక్టర్ సృజనా దేవిని రాజ్ మతాజ్ సంస్థకు చెందిన డాక్టర్ మీనాక్షి అనంతరామ్ తీర్చిదిద్దుతున్నారు. గతంలో నటి మరియు మోడల్ అయిన శోభిత దూళిపాడ, సేలినా జైట్లీ వంటి వారికి రాజ్ మతాజ్ సంస్థ శిక్షణ ఇవ్వటం జరిగిగినది.

డాక్టర్ సృజన దేవికి మిస్ విశాఖపట్నం- 2025 పురస్కారం ప్రధానం చేసే వేడుకను ఈరోజు రాజ్ మతాజ్ సంస్థ అత్యంగా వైభవంగా నిర్వహించినది. ఈ వేడుకలకు శ్రీమతి వంగలపూడి అనిత, హోంశాఖ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డాక్టర్ సి. రాఘవ రెడ్డి, బెల్ రైస్ కంపెనీ, CMD, శ్రీ కరణంరెడ్డి నరసింగ రావు, డాక్టర్ యార్లగడ్డ గీత, శ్రీమతి ఎస్. పద్మజ రీజినల్ డైరక్టర్, మెడికవర్ హాస్పిటల్స్, శ్రీ బి.కె. అగర్వాల్, ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ లతో పాటు స్థానిక ప్రముఖులు అనేకమంది హాజరైనారు.

Use Social Media to Spread the Word about Our News

related articles