ప్రతి ఒక్కరు ఒకటికి మించి మొక్కలు నాటి పెంచండి
– శీతోష్ణస్థితి వేడెక్కడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి
– ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలి.
– తల్లికి వందనం పేరుతో మొక్కలు నాటండి
– డాక్టర్ శ్వేత, డెర్మటాలజిస్ట్
ప్రతి ఒక్కరు ఒకటికి మించి మొక్కలు నాటి పెంచండి అని డెర్మటాలజిస్ట్ డాక్టర్ శ్వేత పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం విశాఖపట్నం జిల్లా, ఎంవిపి కాలనీ లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ విద్య సంస్థలో మొక్కలు నాటిన అనంతరం ఆమె విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి శీతోష్ణస్థితి వేడెక్కకుండా చూడాలని కోరారు. చెట్లను కాపాడండి ప్రాణవాయువుని పెంపొందించండి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరులను కాపాడాలని కోరారు. తమ కుటుంబంలో ఉన్న వారందరికీ పర్యావరణ పరిరక్షణ, ఒక సారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించాలని చెప్పారు
ఈ కార్యక్రమంలో విద్యా సంస్థ హెడ్ మిస్ట్రెస్ జాస్లిన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒకటికి మించి మొక్కలు నాటాలని కోరారు. పర్యావరణ హితంగా జీవించాలన్నారు. సమస్త జీవరాశిని కాపాడాలి అని విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జే వి రత్నం మాట్లాడుతూ పండ్లు జాతి, పక్షులు గూళ్ళు పెట్టుకునె, ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి వనాలు పెంచాలని కోరారు. భూమి మీద ఏ జీవి అంతరించినా దాని దుష్ప్రభావం మానవాళి మీద పడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, డాక్టర్ జనపరెడ్డి లిఖిత, యాక్షన్ ఎయిడ్ కర్ణాటక సంస్థ ఫెసిలిటేటర్ ఐ కృష్ణకుమారి, గ్రీన్ క్లైమేట్ టీమ్ సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు
ప్రతి ఒక్కరు ఒకటికి మించి మొక్కలు నాటి పెంచండి
32