మిద్దిపై తోటల పెంచండి పర్యావరణాన్ని రక్షిద్దాం గ్రీన్ క్లైమేట్ టీం

by vvwnews.com

ప్రకృతి ఆధారంగా ప్రతి ఇంటా పంటలు పండించాలి
– మన ఆరోగ్యం మన చేతల్లోనే
– మా ఇంట్లో ప్రకృతి ఆధారంగా పంటలు పండిస్తున్నాం
– మిద్దె తోటలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి
– బొలిశెట్టి సత్యన్నారాయణ, జాతీయ సమన్వయ కర్త, జలబిరాదరి, జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి
ప్రకృతి ఆధారంగా ప్రతి ఇంటా పంటలు పండించాలి అని జలబీరాద్రి సంస్థ జాతీయ సమన్వయకర్త, జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి అయిన బొలిశెట్టి సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. మురళీ నగర్ లోని మినియేచర్స్ ఎక్స్పర్ట్ రమాదేవి ఇంటి వద్ద ఉన్న మిద్దె తోట, ఆమె వ్యర్ధాల నుంచి తయారు చేసిన అద్భుతమైన బొమ్మలు, చిన్న చిన్న కళాఖండాలు చూసి అబ్బుర పరిచే విధంగా ఉన్నాయి అన్నారు. మిద్దె మీద పూసిన కలువలు, కూరగాయలు ఆకుకూరలు పండ్లు అద్భుతంగా ఉన్నాయి అన్నారు. మన ఆరోగ్యం మన చేతల్లోనే ఉంది అన్నాను. తమ ఇంట్లో కూడా ప్రకృతి ఆధారంగా పంటలు చాలా కాలం గా పండిస్తున్నాం అని వివారించారు. మిద్దె తోటలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అని అక్కడకు వచ్చిన మహిళలు అందర్నీ ఆయన కోరారు. మిద్దె తోటల నగరం గా విశాఖపట్నాన్ని తీర్చి దిద్దేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన వనమాలి, సిటిజి సభ్యులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వనమాలి, సిటిజి అడ్మిన్ లు మళ్ళ సరిత, అరవల అరుణ, నగరం లోని 14 ప్రాంతాలకు చెందిన ఏరియా ఇంచార్జీలూ పాల్గొని మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles