జై చిరంజీవ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఈరోజు ముహూర్తం షార్ట్ తో ప్రారంభించారు “నేనెవరు” చిత్రం పేరు

by vvwnews.com

జై చిరంజీవ ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్రం ఈరోజు ఎంవిపి కాలనీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ముహూర్తం షార్ట్ తో ప్రారంభించారు “నేనెవరు” చిత్రం పేరు
మూవీ….

సమాజాన్ని జాగృతం చేస్తూ, వ్యవస్థను మంచి మార్గంలో నడిపించే దృక్పధం తో నిర్మితమౌతున్న ‘నేనెవరు’ చిత్రం విజయవంతం కావాలని స్టార్ట్ మేకర్ సత్యానంద్, ప్రముఖ విద్యా వేత్త ఆల్వార్ దాస్ విద్యాసంస్థల అధినేత సుంకరి రవీంద్ర అకాంక్షించారు. జై చిరంజీవి మూవీ మేకర్స్ బేనర్ పై సరికొండ మల్లేష్ సమర్పణ లో తన్నీరు చిరంజీవి రచన, దర్శకత్వం లో రూపొందుతున్న ప్రొడక్షన్ నెంబర్ 2,నేనెవరు చిత్రం ఎంవీపీ సెక్టర్ సిక్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రారంభమైంది. ఈ సందర్బంగా మొదటి సన్నివేశానికి సత్యానంద్, రవీంద్ర క్లాప్ కొట్టి ప్రారంభించారు. అనంతరం హీరోయిన్ దీపికా డైలాగ్ తో షూటింగ్ కొనసాగింది. ఈ నేపథ్యంలో సత్యానంద్, సుంకరి రవీంద్ర మీడియతో మాట్లాడుతూ నేనెవరు చిత్రం వినూత్న రీతిలో అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే చిత్రంగా రూపొందుతుందన్నారు. దర్శక,నిర్మాతలు రెండు కళ్లుగా చిత్రాన్ని సమాజశ్రేయస్సు కోసం నిర్మించడం అభినందించక తప్పదని ప్రశంశించారు. ఇటువంటి చిత్రాలను ప్రేక్షకులు అందరిస్తారని అన్నారు. నిర్మాత అండేకార్ జగదీష్,దర్శకుడు చిరంజీవి మాట్లాడుతూ ఓ అనాధ తన జీవితంలో సాధించిన విజయమే నేనెవరు చిత్రమన్నారు. ఈ చిత్రం లో ఓ అనాధ జీవితంలో భిన్నమైన అంశాల విజయమే చిత్ర సారాంశం గా వివరించారు. ఈ చిత్రం లో హీరో, హీరోయిన్ లుగా అభిలాష్, సాయిచరీష్ దీపికా, సోనాక్షి తో పాటు సీనియర్ నటులు సాయికుమార్, తనికెళ్ళ భరణి, జబర్దస్త్ రాజమౌళి, కనకవ్వ,ప్రముఖ పాప్ సింగర్ జానులిరి నటిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమం లో సహా నిర్మాతలు సత్యనారాయణ, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles