శాసన మండలి ప్రతి పక్ష నేత బొత్స. సత్యనారాయణ పత్రికా సమావేశం..
*బొత్స. సత్యనారాయణ కామెంట్స్…*
మొత్తం కార్పొరేటర్ లలో అధిక సంఖ్య లో యాదవ కులం కి చెందిన వారు ఉండటం వల్ల హరి వెంకట కుమారి ని మేయర్ గా మా అదినాయకులు నియమించడం జరిగింది. ఒక బీసీ మహిళ మీద మీకు ఎందుకు అంత అక్కసు…
ఇప్పటికే సంవత్సర కాలం అవుతుంది రాష్ట్రము లో సంపద సృష్టి లేదు,
చేతకాని అమ్మ మద్దెల సరిగా మొగలేదు అందుకే ఆడలేదు అన్నట్లుంది.
మిర్చి రైతులకు ఆదుకుంటాం అన్నారు, మీ కున్న ప్రభుత్వ ఏజెన్సీ ల ద్వారా ఒక్క కేజీ అయినా గిట్టుబాటు ధర కి కొన్నారా.. పొగాకు రైతులకు కూడా అలాగే చేసారు
వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నానుడు నిజం చేస్తున్నారు.
మిరిచ్చిన మాట ఏ ఒక్కటి అయినా అమలు చేసారా
మాటలు చుస్తే కోటలు దాటుతున్నాయి పనులు చుస్తే ఏమీ కనపడటం లేదు.
గ్రామాల్లో రైతు కూలీకు ఇబ్బందులు పడుతున్నారు
ఎంతసేపు డైవర్సన్ పొలిటిక్స్, దోపిడీ, .
సంపద సృష్టి అని అన్నారు ఎక్కడ చూసినా అప్పులు చేస్తున్నారు.
ప్రభుత్వం లో ఎక్కడా జవాబుదారి తనం కనపడటం లేదు.
గత పదినెలలు గా వితంతు పింఛన్ లు విడుదల చేయడం లేదు.
ఉపాధి హామీ నిధులు విడుదల విషయం లో స్థానిక నాయకులు ఏంచేస్తున్నారో అర్ధం కావడంలేదు, ప్రభుత్వం మీద వత్తిడి తేవాల్సిన భాద్యత వారి మీద లేదా,
ఉపాధి హామీ కూలీలకు ఎందుకు 80 రోజులుగా డబ్బులు ఇవ్వడం లేదు,ఇలాంటి దుస్థితి రాష్ట్ర చరిత్ర లోనే ఎప్పుడు లేదు.
తిరుపతి లో గోవులు చెనిపోయిన విషయం లో కరుణాకర్ రెడ్డి పరుశపదజాలం వాడవలసిన అవసరం ఏముంది.
అధికారం లో ఉన్నవారు సహనం తో ఉండాలి,
పోలీసులు ను అడ్డంపెట్టుకుని ఎన్నాళ్ళు హింస చేస్తారు
ఎంతసేపు పోలీస్ లు మీ వెనకాలే ఉండడానికి వరేం వాచ్మెన్ లు కాదు.
రైల్వే జోన్ విషయం లో మా ప్రభుత్వం లో స్థలం మంజూరు చేసాము. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకూ GO కూడా జారీ చేయలేదు.