*మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి*
వైసీపీలో కార్పొరేటర్ గా కొనసాగుతూ తాజాగా జనసేనలో చేరిన 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తీరుపై తండ్రి,మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.తండ్రి మాటను కాదని వేరే పార్టీలో చేరడంపై నాగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.గాజువాక బీసీ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల తన కుటుంబంలో జరిగిన పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు.వైసీపీలో సముచిత స్థానం,అనేక పదవులు పొందిన తమ కుటుంబంలో పెద్ద కుమారుడు వంశీరెడ్డి తన మాటను సైతం లెక్కచేయకుండా జనసేనలో చేరాడని అన్నారు.తొలినుంచీ వంశీ వ్యవహార శైలి తనకు నచ్చలేదని అయినప్పటికీ సర్దుకుపోతూ వచ్చానని తెలిపారు.పార్టీ మారుతాడని కానీ,ఆ ఆలోచనలు ఉన్నట్టు ఏరోజూ తనకు చెప్పలేదని పేర్కొన్నారు.ఇంట్లో పెద్ద కుమారుడే ఇలా చేస్తాడని అనుకోలేదని ఇది తనను బాధించింది అన్నారు.వంశీ వెళ్లినంత మాత్రాన వైసీపీకి జరిగే నష్టం ఏమీ లేదన్నారు.గాజువాకలో పార్టీ బలంగానే ఉందని మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు