*విపత్తుల నిర్వహణపై అవగాహన మాక్ డ్రిల్*
విశాఖపట్నం, ఏప్రిల్ 2: ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ, గుంటూరు పిలుపు మేరకు, విశాఖపట్నం మహారాణిపేట తహశీల్దార్ వారి ఆధ్వర్యంలో జబ్బర తోట, చంగల్ రావు పేట, మత్యకార గ్రామంలో బుధవారం విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తుఫానులు, అగ్ని ప్రమాదాలు, భవనాలు కూలినపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రజలకు అవగాహన కల్పించబడింది. మాక్ డ్రిల్‌లో అగ్నిమాపక శాఖ, NDRF, మెడికల్, GVMC, గ్రామీణ నీటి సరఫరా, రోడ్లు-భవనాలు, ప్రజారోగ్య శాఖల భాగస్వామ్య అధికారులు పాల్గొన్నారు. 200 మంది అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో, విపత్తు సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యల గురించి స్పష్టమైన అవగాహన కల్పించబడింది. అధికారుల సూచనలు ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రయోగాత్మక ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి.
జారీ: ఎం. ఎస్. కళావతి
ప్రాజెక్ట్ మేనేజర్, విపత్తుల నిర్వహణ సంస్థ, విశాఖపట్నం
విపత్తుల నిర్వహణపై అవగాహన మాక్ డ్రిల్
44
previous post