వెస్పా ఎస్ టెక్ స్పెషల్ ఎడిషన్ గా ‘వెస్పా ఖలా’ అని నామకరణం చేసారు. 125సిసి & 150సిసి లలో ఖాల,

by vvwnews.com

నవ శకానికి నాంది వెస్పా కొత్త లగ్జరీ స్కూటర్ల ఆవిష్కరణ
విశాఖపట్నం: 23 మార్చి 2025 :ద్విచక్ర వాహన శ్రేణిలో దిగ్గజం వెస్పా, ఈరోజు విలాసవంతమైన జీవనసరళికి అనువైన లెజండరీ స్కూటర్ బ్రాండ్ వెస్పా, హై-ఎండ్ లగ్జరీ స్కూటర్‌లను ప్రవేశపెట్టినది. ఈరోజు విశాఖపట్నంలో వెస్పా మరియు అప్రిలియా కొరకు పియాజియో అధీకృత డీలరు ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అద్భుతమైన వెస్పా -2025 వెస్పా స్కూటర్ల ఆవిష్కరణ వేడుకను నిర్వహించారు.
ఈ ఆవిష్కరణ వేడుకలలో ముఖ్య అతిథిగా శ్రీ వాలెంటినా మిశ్రా, ప్రెసిడెంట్ మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవానికి భారతదేశపు నేషనల్ డైరెక్టర్ వారు, గౌరవ అతిథిగా శ్రీ. డి సత్యనారాయణ రెడ్డి, సెక్రటరీ & కరస్పాండెంట్ ప్రిజం కాలేజ్, విశాఖపట్నం వారు, ప్రత్యేక ఆహ్వానితులుగా రాహుల్ సరవగి, మేనేజింగ్ డైరెక్టర్ S K సరవాగి & కో ప్రైవేట్ లిమిటెడ్ వారు, మరియు శ్రీ. పిల్లి కృష్ణకాంత్, మేనేజింగ్ డైరెక్టర్, ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేవలం రవాణా సాధనంగా మాత్రమే కాక తరతరాల సాంస్కృతిక చిహ్నంగా మరియు ప్రతిష్టాత్మకతకు నిదర్శనంగా వెస్పా పేరొందినది అన్నారు. వెస్పా విలాసవంతమైన స్కూటర్ బ్రాండ్‌పై విశాఖ ప్రజలు ఎల్లప్పుడూ ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నారని, విశాఖ నగరంలో 2025 సరికొత్త హంగుల వెస్పా స్కూటర్ మోడల్స్ ఆవిష్కరించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము అన్నారు. వెస్పా పోర్ట్‌ఫోలియో సరికొత్త సాంకేతికత అత్యుత్తమ పని సామర్థ్యత కలిగి, ఎప్పటిలాగే ఉత్తమ వాహనంగా మారుతుందని విశ్వసిస్తున్నాము అన్నారు.
2025 వెస్పా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో:సాధారణంగా వాహన దారులు తమ స్కూటర్ మంచి నాణ్యత మరియు పనితీరు తోపాటుగా చక్కని డిజైన్ తో అందంగా ఆకర్షణీయంగా కూడ కనపడాలని ఆశించటం సహజం. ఖాతాదారుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని వెస్పాను ప్రత్యేకంగా మరియు ఐకానిక్ డిజైన్ లతో అందరిని ఆకర్షించు విధంగా రూపకల్పన చేసారు. ప్రతి ఖాతాదారు కోరుకునే అంశాలు కొత్త వెస్పాలో జోడించారు. ఆధునిక సాంకేతికత తోపాటు స్టయిల్ గా అందరిని ఆకర్షించు విధంగా రూపొందించారు. క్లాసిక్ ఇంటర్‌ప్రెటేషన్‌ను కోరుకునే వారి కోసం వెస్పా మరియు వెస్పా-S, ఆధునిక సాంకేతికత తోపాటు ముచ్చటైన సౌందర్యం పట్ల ఆసక్తి కలవారి కోసం వెస్పా టెక్ మరియు వెస్పా -ఎస్ టెక్ మరియు ప్రత్యేకమైన మరియు స్పెషల్ -ఎడిషన్ కళాత్మకతను కోరుకునే వారి కోసం “వెస్పా క్వాలా” స్కూటర్లను ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూంలో అందుబాటులో ఉంచారు.
వెస్పా S వేరియంట్ 125 సిసి మరియు 150 సిసి స్పోర్టీ ప్యాలెట్‌లో ఆలివ్ గ్రీన్ (మాట్), ఓరో, పెరల్ వైట్ , నీరో బ్లాక్ (మాట్), గియాల్లో ఎల్లో (మాట్), టుస్కానీ ఆరెంజ్, రెడ్ & పెరల్ వైట్, బ్లాక్ & పెరల్ వైట్ రంగుల్లో లభిస్తాయి.
వెస్పా ఎస్ టెక్ స్పెషల్ ఎడిషన్ గా ‘వెస్పా ఖలా’ అని నామకరణం చేసారు. 125సిసి & 150సిసి లలో ఖాల, బ్లూ, గ్రే వంటి మూడు రంగులలో లభిస్తుంది.
నూతనంగా ఆవిష్కరించిన 2025 వెస్పా పోర్ట్‌ఫోలియో విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం లోని అన్ని ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి డీలర్లు వద్ద లభిస్తాయి.

Use Social Media to Spread the Word about Our News

related articles