పంచాంగ కర్త సుబ్రమణ్య శాస్త్రికి ఘనసత్కారం ఎంవిపి కాలనీ విశాఖపట్నం

by vvwnews.com

పంచాంగ కర్త సుబ్రమణ్య శాస్త్రికి ఘనసత్కారం
ఎంవిపి కాలనీ విశాఖపట్నం 23
ప్రముఖ పంచాంగ కర్త శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామానికి చెందిన మావుడూరు సుబ్రమణ్య శాస్త్రిని సత్కరించారు. ఆదివారం శివాజీ పార్క్ లో బాలభాను అర్చక మరియు పురోహిత సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పంచాంగ కర్తను లాంచనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ప్రముఖ సంఘ సేవకులు కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ అర్చకుల పురోహితుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యవర్గ సభ్యులు కోరినట్టు తన వంతుగా భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అంతకుముందు పంచాంగ కర్త మావుడూరు సుబ్రమణ్య శాస్త్రి మాట్లాడుతూ సూర్యసంచారం ఆధారంగా పంచాంగాన్ని రచించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రముఖుల సలహాలు సూచనలు తీసుకున్నానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాలభాను అర్చక, పురోహిత సంఘం అధ్యక్ష కార్యదర్శులు జోష్యుల కామేశ్వర శర్మ, మావుడూరు కిషోర్ కుమార్ శర్మ ఎక్కడ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles