ఎస్పీ వర్గీకరణ పై ప్రభుత్వం వేసిన కమిషన్ ను వెనక్కి తీసుకోవాలి

by vvwnews.com

ఎస్పీ వర్గీకరణ పై ప్రభుత్వం వేసిన కమిషన్ ను వెనక్కి తీసుకోవాలి

కూటమి ప్రభుత్వంలో మాల ఎమ్మెల్యేలు, ఎంపీ లు సిగ్గు పడాలి

దళితులతో పెట్టుకున్న రాజకీయ పార్టీలు కొట్టుకుపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు

మాలమహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు నాగ మల్లేశ్వరి

విశాఖపట్నం : కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అంశాన్ని టచ్ చేసి అన్నదమ్ముల వలే వున్న తమను విడదీసే ప్రయత్నాలు ప్రారంభించిందని మాలమహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు, అఖిల భారత మాల సంఘాల జేఏసీ మహిళా చైర్మన్ , డాక్టర్ మంచాల నాగ మల్లేశ్వరి మండిపడ్డారు. విశాఖలోని పౌర గ్రంధాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలోనే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదని ఆందోళన కార్యక్రమాలు చేయడమే కాక, కోర్టులో కూడా పిటీషన్స్ వేయడం జరిగిందన్నారు అయినా కూటమి ప్రభుత్వం నిమ్మకు నిరేత్తిలా వ్యవహరిస్తున్న తీరును మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. హడావుడిగా ఒక కమిషన్ వేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఒక ప్రాతిపదిక లేకుండా డేటా లేకుండా ఎస్సైలను విడదీయాలని చుస్తే ప్రభుత్వం తనకే తానే నిప్పుపెట్టుకున్నట్టేనని ద్వజమెత్తారు హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పిందని ప్రభుత్వం తనకు నచ్చినట్టు విడదీసి రిజర్వేషేన్లు కల్పించేసి ఇవ్వమని ఎక్కడ చెప్పలేదన్నారు దానికి ప్రాతిపదికగా వున్న డేటా ను తీసికోవాలని ఆ డేటా లో కూడా ఎంత మంది ఉద్యోగులు వున్నారు, ఎంత మంది విద్యావంతులు వున్నారు, పారిశ్రామిక వేత్తలు వున్నారు వారి ఆర్ధిక స్థితిగతులు చూసి అంచనా వేసి కమిషన్ వేసి దానింటిలో కూడా లోటుపాట్లు చూసి చేయాలని ఇది అంతా ఒక ప్రాసెస్ అని పేర్కొన్నారు . మంద కృష్ణ మాదిగ మొప్పు కోసం ఇటువంటి చర్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో 9 శాతం మాదిగలు వున్నారని అక్కడ ఇచ్చారని ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువగా వున్నారని ఆ లెక్క ప్రకారం ఇక్కడ కూడా ఇవ్వలన్నారు అక్కడో రూల్ ఇక్కడో రూల్ అంటూ విరుచుకుపడ్డారు. అన్నదమ్ములా వుండే తమను విడదీసే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. 59 ఉపకులాల ఉన్నాయని ఒక ఉప కులం అడిగిందని నిర్దాక్షణంగా అందరిని విడదీసి వారికీ అత్యధిక పర్సటెంజ్ ఇస్తే మిగితా కులాలు ఏ రిజర్వే షేన్ పొందాలని నిలదీశారు. 15శాతం కూడా మంద కృష్ణ మాదిగ తీసుకుంటే మిగతా 58 కులాల రోడ్డున పడతాయన్నారు . రాజకీయ లబ్ది, కోసం రాజకీయ అవకాశాలు కోసం జాతిని తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో వున్న మాల ఎమ్మెల్యేలు, ఎంపీ లు సిగ్గు పడాలన్నారు దగ్గరుండి జాతిని అమ్మేస్తున్నారన్నారు. జాతిని వాడుకొని ఎమ్మెల్యే , ఎంపీ పదవులు పొందారన్నారు. అది మర్చిపోతున్నారన్నారు . అంబేద్కర్ విగ్రహాం ముందు నిలబడి మీకు పదవులు ముఖ్యమా , జాతి ముఖ్యమా జాతి పోతుంటే మీరు నిర్వీర్యం అయిపోయిన తీరుకు సిగ్గు పడాలని మాల మహానాడు హెచ్చరిస్తుంది జాతిని కాపాడుకోలేనప్పుడు ఏ పదవిలో ఉంటే ఎందుకు అంటూ మండిపడ్డారు. క్రిమీలేయర్ ను తీసుకొచ్చి రిజర్వ్ షన్ ఎత్తివేయాలని బీజేపీ , కూటమి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు . క్యాబినెట్ ఆమోదంలో ఎంత మంది మాల ఎమ్మెల్యేలు వున్నారు. 2011 సెనెక్స్ తీశారు ఇంతకంటే అన్యాయం ఇంకొకొటి ఉంటుందా అది జనాభా లెక్కలు తీసిన సర్వే, కుల గణాంక సర్వే కాదు రాష్ట్ర ప్రభుత్వానికి కుల గణాంక సర్వే,జనాభా లెక్కలు అంటే ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నందుకు తాము సిగ్గు పడుతున్నామన్నారు ఇప్పటి వర్కౌ 1956 నుంచి ఇప్పటి వరకు సర్వ్ జరగలేదన్నారు. నామకే వాస్తే సర్వే చేసి విడదీస్తాం అంటే ఒప్పుకొనేది లేదన్నారు చంద్రబాబు, లోకేష్ బాబు , పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో 70 లక్షల మంది దళితులకు చేస్తున్న అన్యాయానికి మాలల మనోబావాలని దెబ్బతీస్తున్న తీరుకు వారికీ ఇవే చివరి ఎన్నికలు అని స్పష్టం చేశారు. దళితులతో పెట్టుకున్న రాజకీయ పార్టీలు కొట్టుకుపోయిన్నారు గతంలో వర్గీకరణ చేసినప్పుడు హైకోర్టు అక్షింతలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రములో సమగ్ర కులగణ సర్వే జరగాలన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్పీ వర్గీకరణ జరగనివ్వమని ప్రభుత్వం కమిషన్ ను వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రంలో జరిగే పరిస్థుతులకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు తమ ఆందోళలను మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాల మహానాడు నాయుకులు త్రినాధ్, వెంకటరమణ , ధర్మవతి పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles