ఈ ప్రదర్శన విశాఖ నగరంలోని హోటల్ నోవాటెల్‌లో మార్చి 11 నుండి 12వ తేదీ వరకు10am to రాత్రి 9 pm

by vvwnews.com

నగరంలో ఫ్యాషన వస్త్రాల ప్రదర్శన
విశాఖపట్నం 11 మార్చి 2025 : నగర వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ నగరానికి వచ్చింది. ఈ ప్రదర్శన మార్చి 11 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు రెండు రోజులు పాటు స్థానిక నోవా టెల్ హోటల్ నందు నిర్వహిస్తున్నారు.దేశం నలుమూలల నుండి వచ్చిన అనేక మంది డిజైనర్స్ ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. సరికొత్త డిజైనర్ వేర్ వస్త్రాలను, అద్భుతమైన పనితనం కలిగిన ఆభరణాలు మరియు అనేక రకాల ఉపకరణాలు అన్ని ఒకేచోట మీకు లభించే లక్ష్యంతో సూత్రా వారు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసారు.

ఇంతకూ పూర్వం ఎన్నడూ చూడని ఎన్నో రకాల ఫ్యాషన దుస్తులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. భారతదేశం అంతటా గొప్ప ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్న సూత్రా ప్రఖ్యాత డిజైనర్లు, లగ్జరీ బ్రాండ్లు మరియు స్పెషల్ కలెక్షన్స్ అన్నింటిని ఒకేచోట ఏర్పాటు చేసినది. వధువుకు కావలసిన బ్రైడల్ వేర్, రెడీ టు వేర్ వస్త్రాలు మరియు ఆభరణాలు ఈ ప్రదర్శనలో మీరు చూడవచ్చును. ఈ ప్రదర్శనలో మీరు గొప్ప ఫ్యాషన్ అనుభూతిని పొందుతారు.
NAC జ్యుయలర్స్, సిమ్రాన్ దామ్రా వారి ఎహ్సాస్, భూమిక ఛబ్రియా వారి మన్ పసంద, హర్ష డిజైనర్ బొటిక్ పంజాబ్, రిషబ్ కలెక్షన్ ఛత్తీస్‌గఢ్, సాఖ్ యూనిక్ క్లాతింగ్, అకృతి బోటిక్-రాయ్‌పూర్, సిల్క్ & స్పైస్-బాంబే నైట్‌వేర్, లుక్నోవి కుర్తీలు మరియు ప్లాజో, లడఖ్ సిల్క్ శారీస్ వంటి విభిన్న ఫ్యాషన్ మరియు సంప్రదాయ దుస్తులు వారు మరియు రైన్స్ – జైపూర్, RK కలెక్షన్ కోల్‌కతా, విమా దిలీప్, ఖ్వాహిష్ వంటి గొప్ప నగల వ్యాపారులు తమ అద్భుతమైన, సొగసైన సున్నితమైన నగల డిజైన్‌లు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు.
మీ బందు మిత్రులతో సూత్రా ప్రదర్శనకు విచ్చేసి లైఫ్ స్టయిల్ కావలసిన ప్రత్యేకమైన ఫ్యాషన్ వస్త్రాలు మరియు నగలు అన్నింటిని ఒకేచోట పొందవలసినదిగా నిర్వాహకులు సూచిస్తున్నారు. డిజైనర్ ఎత్నిక్ వేర్‌ల కోసం లేదా బ్రైడల్ కలెక్షన్‌ల కోసం షాపింగ్ చేయాలనుకుంటే సూత్రా సరియైన ప్రదేశమని నిర్వాహకులు చెపుతున్నారు.

ఈ ప్రదర్శన విశాఖ నగరంలోని హోటల్ నోవాటెల్‌లో మార్చి 11 నుండి 12వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది.

Use Social Media to Spread the Word about Our News

related articles