*విశాఖ జిల్లా కబడ్డీ జట్టును అభినందించిన ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు , సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
“`ఈ నెల కర్నూల్ జిల్లాలో 3,4,5 తేదీలలో జరిగిన ఎం. రంగారావు మెమోరియల్ 50 వ అంతర్ జిల్లాల బాలబాలికల కబడ్డీ పోటీలలో ఫైనల్స్ లో బాలికల విభాగం లో విశాఖ జట్టు కర్నూల్ జట్టు పై 10పాయింట్ల తేడాతో ప్రధమ స్థానం సాధించింది .అదే విధంగా బాలుర విభాగం లో ఫైనల్స్ లో విశాఖ జిల్లా జట్టు కర్నూల్ జట్టుమీద 12పాయింట్స్ తేడా తో ప్రధమ స్థానం సాధించి విశాఖ బాలబాలికల జట్టు ఛాంపియన్ షిప్ సాధించారు.ఈ సందర్భంగా క్రీడాకారులుకి శివాజిపాలెం విశాఖ సౌత్ ఎమ్మెల్యే ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ తన స్వగ్రామం లో క్రీడాకారులుని అభినందనలు తెలియజేసారు. మరిన్ని విజయాలు సాధించాలని, తమవంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ వుంటాయని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆర్గనైసింగ్ సెక్రటరీ ఊరుకుటి శ్రీనివాసరావు, ఎం ఉమా శంకర్ బాబు, వి బాబురావు, ఎం గణపతి రావు,న. ప్రకాష్, పి కోటేశ్వరరావు సెక్రటరీ,పి సత్యనారాయణ, శివ, సత్యనారాయణ, కృష్ణ,కోచ్ వసంత్, త్రివేణి తదితరులు పాల్గొన్నారు…“`