కూటమి ప్రభుత్వం చేసింది స్టీల్ ప్లాంట్ మీద అన్ని బూటకమైన మాటలే అని వామపక్ష నాయకులు అన్నారు

by vvwnews.com

స్టీల్ ప్లాంట్ ఆర్ధిక ప్యాకేజి పై సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు వాయిస్ 🖕

కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు 14,440 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ విడుదల చేసినట్లు ప్రకటించింది. దీన్ని స్వాగతిస్తున్నాం. అయితే దీంతోనే స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అయిపోతుందని ప్రకటన చేయడం ఒక బూటకమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు తీవ్రంగా తప్పు పట్టారు.
ఒక సంవత్సరం ముడి ఖనిజం కొనుక్కోవడానికి 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇప్పటికే 12 వేల కోట్ల రూపాయలు నష్టం గానీ, అప్పులు గాని చూసినట్లయితే ఇది ఏ మూలకు సరిపోదని అన్నారు.
దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు సొంత గనులు ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యం తో నడవాలంటే సొంత ఇనుప గనులు ఇవ్వాలని, ప్రైవేటీకరణ చర్యలు మానుకోవాలని సీఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఇట్లు
Ch నరసింగరావు
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Use Social Media to Spread the Word about Our News

related articles