ఈ రోజు (09.01.2025) విశాఖపట్నం , మద్దిలపాలెం , కృష్ణా కాలేజ్ రోడ్డు లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి వర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి పత్రికా సమావేశం జరిగింది.
తిరుపతిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం
తిరుపతిలో జరిగిన సంఘటనలో 7 మంది చనిపోవడం బాధాకరం.
టీటీడీ చరిత్రలో నిన్న ఒక బ్లాక్ డే..
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో ప్రభుత్వం, టీటీడీ విపలమయ్యింది.
తిరుమలలో 7 మంది మరణాలు ప్రభుత్వ హత్యలే.
టీటీడీ చరిత్రలో ఎన్నడు ఇటువంటి సంఘటనలు జరగలేదు.
ఈ మరణాలకు బాధ్యత సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మెన్ ది
చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి.
గాయపడిన వారికి 20 లక్షలు ఇవ్వాలి..
వెంకన్న చౌదరి టీటీడీ సేవలో ఉన్నారా చంద్రబాబు సేవలో ఉన్నారా
అధికార యంత్రాంగం టీటీడీ విజిలెన్స్ ఏమయ్యాయి..
ఈ మరణాలు కూడా వైఎస్ జగన్ మీద వేసేస్తారా..?
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించింది.
వైఎస్ జగన్ పాలనలో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు..
టీటీడీని తమ రాజకీయాలకు కూటమి వాడుకుంది.
లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అభాసు పాలయ్యారు..
టిడిపి ఏడు నెలల కాలంలో ఇక ప్రాజెక్టు అయిన తెచ్చారా..
గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వచ్చింది.
బల్క్ డ్రగ్ పార్క్ వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చింది.
బల్క్ డ్రగ్స్ పార్క్ ను టిడిపి నేతలు వ్యతిరేకించారు..
కృష్ణపట్నం హబ్ ను వైఎస్ జగన్ పాలనలో వచ్చింది
వైఎస్ జగన్ తెచ్చిన ప్రాజెక్టు లకు చంద్రబాబు సొంత డబ్బా కొట్టుకుంటున్నారు.
చంద్రబాబు పవన్ మోడీ బజన చేయడానికి పోటీ పడ్డారు.
టీటీడీ మీద శ్రద్ధ పెడితే ఈ మరణాలు జరిగేవి కాదు.
ఈ మరణాలు తరువాత పవన్ కళ్యాణ్ ఏమి దీక్ష చేస్తారో చెప్పాలి.
సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ ఈ మరణాలు గురించి ఏమీ చెపుతారో చూడాలి.
బహిరంగ సభలో ప్రధాని మోడీని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని,రాష్ట్ర ప్రయోజనాల కోసం ధైర్యంగా వైఎస్ జగన్ మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్ కోసం కనీసం మోడీని చంద్రబాబు పవన్ అడగలేక పోయారు.
ఇంకవారేమి స్టీల్ ప్లాంట్ ను కాపాడుతారు.
ఈ సమావేశం లో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి రవి రెడ్డి , నియోజకవర్గం పరిశీలకులు మొల్లి అప్పారావు , అనుబంధ విభాగం అధ్యక్షులు బి. శివ రామ కృష్ణ , బొండా ఉమా మహేశ్వర్ రావు, కార్పొరేట్లు శ్రీమతి కెల్లా సునీత సత్యనారాయణ పార్టీ నాయుకులు ఉమ్మడి దాస్, మువ్వల సురేష్, పళ్ళ దుర్గ, సురాడ దాస్, పీతల గోవింద, శ్రీనివాస్ రెడ్డి , పిలా ప్రేమ కుమార్ తదితరాలు పాల్గొన్నారు.