ప్రప్రధమంగా గ్రాఫైట్ సిరామిక్స్ గ్యాలరీ ఆవిష్కరణ
విశాఖపట్నం 9 జనవరి 2025 : ఈరోజు స్థానిక రామా టాకీస్ రోడ్ సెంటర్ లో ఎక్సెల్ వరల్డ్, పేరిట మొట్ట మొదటి గ్రాఫైట్ గ్యాలరీ ఆవిష్కరించారు. గుజరాత్ రాష్ట్రం లోని మోర్బీ ప్రాంతంలో 12 ఎకరాల స్థలంలో స్థాపించిన గ్రాఫైట్ టైల్స్ కంపెనీ ఉత్పత్తులను ఈ గ్యాలరీలో అందుబాటులో ఉంచుతారు. సంస్థ 9 mm మందం కలిగిన GVT / PGVT టైల్స్‌ను 1200 mm x 1800 mm, 1200 mm x 1200 mm, 800 mm x 1600 mm, 600 mm x 1200 mm సైజులలో తయారు చేస్తుంది.
గ్రాఫైట్ సెరామిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 50 లక్షల చదరపు మీటర్లు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగి 10 రకాల టైల్స్ ఎంపికల కోసం ప్రీమియం & సాంప్రదాయిక ఉపరితలాలుగా వర్గేకరించి తయారు చేస్తారు. గ్రాఫైట్ టైల్స్ ఎందుకంటే అవి గ్లేజ్డ్ & పాలిష్డ్ గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ గా 6000 పైగా రకాలతో మీరు కోరుకున్న విధంగా మీ ఫ్లోరింగ్ ను అందంగా తీర్చిదిద్దుతాయి. అంతేకాక కంపేనీ తమ ఉత్పత్తులను చక్కని ఎలాటి అతుకులు లేని విధంగా అమర్చుటకు వీలుగా ఉంటాయి. టైల్స్ తయారీలో వినూత్న సాధించుటకు R & D (పరిశోధన & అభివృద్ది ) ల్యాబ్ నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తుంటుంది. ఉపరితలం (సర్ఫేస్ ) అభివృద్ది కోసం కావలసిన ముడి పదార్థాలు మరియు ఇంకులను స్పెయిన్ నుండి కంపనీ దిగుమతి చేసుకుంటుంది.
సంస్థ యొక్క చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మొదట ఆర్కిటెక్ట్ & ఇంటీరియర్ డిజైనర్‌గా ఉన్నారు , ఇప్పుడు అందమైన సొగసు నిండిన టైల్స్ తయారీలో ఉత్పత్తులను అభివృద్ది పరచు పారిశ్రామికవేత్త. చిట్టచివరి వినియోగదారు సైతం విలాసవంతమైన టైల్స్ జీవనశైలి లో చిరస్మరణీయమైన అనుభవం పొందేలాగా గ్రాఫైట్ ఉత్పత్తులను సృష్టిస్తారు. ఈ గ్యాలరీ ఆవిష్కరణలో ముఖ్య ఉద్దేశ్యం వినియోగదారునికి 6000 పైగా అనుకూలమైన ఉత్పత్తులను ప్రదర్శించటం. టైల్స్ తయారీ వివరణ ప్యానెల్, ఉపరితల పోలిక ప్యానెల్ , సిరీస్ వారీ ప్యానెల్లు, ఉపరితలం కోసం ఉత్పత్తి ఆల్బమ్‌లు, వర్చువల్ ఫ్యాక్టరీ టూర్ వీడియో ప్రదర్శనలు, ఉత్పత్తి వారీగా 360 డిగ్రీ వర్చువల్ టూర్, కంపెనీ శిక్షణ పొందిన సలహాదారులు సూచనలు, సూర్యకాంతిలో క్లిక్ చేయబడిన ప్రతి ఒక్క టైల్ డిజైన్ ఫోటో, టైల్స్ ఉత్తమ అమరికకు నమూనా సూచనలు, టైల్స్ అమరిక తర్వాత ఫ్లోర్ ఎలా ఉంటుందో 3డి ప్రివ్యూ చిత్రం, ఉత్పత్తిని దగ్గరగా చూడటానికి అధిక రిజల్యూషన్ కలిగిన చిత్రాలు అన్నింటిని ఈ గ్యాలరీ అందుబాటులోకి తెస్తుంది.
బిల్డర్లు, సేకరణ ఏజెన్సీలు, ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు, డీలర్లు, వ్యాపారులు & తుది వినియోగదారులు ఎక్సెల్ వరల్డ్ (EXCEL WORLD ) – గ్రాఫైట్ గ్యాలరీలో 6000 పైగా ఉత్తమ ఉత్పత్తులను స్వయంగా చూసి అనుభూతిని పొందుటకు గ్రాఫైట్ టైల్స్ గ్యాలరీ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాది.
ప్రప్రధమంగా గ్రాఫైట్ సిరామిక్స్ గ్యాలరీ ఆవిష్కరణవిశాఖపట్నం 9 జనవరి 2025
49