AP TARGET BALL ASSOCIATION ప్రెసిడెంట్ గా డాక్టర్ శ్రీ కంచర్ల అచ్యుత్ రావు గారిని ఎన్నుకున్నారు

by vvwnews.com

ఏపీ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా కంచర్ల అచ్యుతరావు

క్రీడలకు అధిక ప్రాధాన్యత

మార్చిలో జాతీయస్థాయి టార్గెట్ బాల్ టోర్నీ

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చార్టిబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత, ఎస్. ఎస్. ఎల్. ఎస్ క్రియేషన్స్ చైర్మన్, అన్నయ్య డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశాఖలో ఆదివారం ఉదయం జరిగిన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ తృతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. టార్గెట్ బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకురానున్నట్టు చెప్పారు. పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడను తీసుకువెళ్తామన్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉపకార్ చార్టిబుల్ ట్రస్ట్ యువత చెడు. మార్గం పట్టకుండా సక్ర మార్గంలో పయనించేందుకు క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తూ వారిని ప్రోత్సాహిస్తూ స్పాన్సర్ షిప్ ను ఇస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో జాతీయ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరవ్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి సురేష్, సూర్య నారాయణ ఉపకార్ ట్రస్ట్ మేనేజర్ సుధీర్, తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles