ప్రెస్ నోట్ ఆటో డ్రైవర్ కు చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల ఆర్థిక భారాలు వేసే జీవో నెంబర్ 21 31 రద్దు చేస్తామని డ్రైవర్లకు పిఎస్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని తేదీ 9 12 2024 ఉదయం 9:30 కి ద్వారకా నగర్ జంక్షన్లో ఆటో డ్రైవర్ల నిరసన జరిగినది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ ఆర్థిక భారాలు వేసే జీవో నెంబర్ 21 31 రద్దు చేస్తామని భారీగా పెంచిన డీజల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని డ్రైవర్లకు వాహన మిత్ర 15 వేల రూపాయలు అమలు చేస్తూ పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్తో తో కూడిన సంక్షేమ బోర్డు చేస్తామని హామీ ఇచ్చి ఆరు నెలలు గడిచిన ఒక్క ఆమె కూడా అమలు చేయలేదని మండిపడ్డారు చంద్రబాబునాయుడు గారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆటో డ్రైవర్లను నిలువు దోపిడీ చేసే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు శ్రీరామ చిట్స్ అండ్ ఫైనాన్స్ అధిక వడ్డీలు వేధింపులపై చట్టపరమైన చర్యలు తీసుకొని పిడి యాక్ట్ కేసులు పెట్టి ఆటో డ్రైవర్ ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఆటో డ్రైవర్ల పిల్లలకు విద్యా వైద్యం 50 శాతం రాయితీ కల్పించి పేద ఆటో డ్రైవర్ కుటుంబాలు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ధర్నా లో రవికృష్ణ స్టాండ్ అధ్యక్షులు యు శివాజీ కే దేముడు ఈశ్వరరావు వై సతీష్ ఎం భాస్కర్ ఎస్ అప్పలరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు యు శివాజీ
సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి ! #vvwnews #appolitics #tdpnews
by vvwnews.com
written by vvwnews.com
42