*జర్నలిస్టులు సహకారం మరపురానిది*.
*పాత్రికేయులు పిల్లలకు ఉచితంగా విఎంఆర్డీఏ సందర్శినీయ ప్రాంతాలు*.
,,*ఘనంగా ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ వన సమారాధన*
. *వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు*
ఎంవీపీ కాలనీ. డిసెంబర్ 8
.
రాజకీయంగా ఎదిగేందుకు తనకు జర్నలిస్టులు అందించిన సహకారం మరపురానిదని వారికి తాను ఎప్పుడు కృతజ్ఞుడు గానే ఉంటానని విఎమ్ఆర్డిఏ చైర్మన్ ఎం ప్రణవ్ గోపాల్ అన్నారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల విశాఖ యూనిట్ల ఆధ్వర్యంలో ఆదివారం శివాజీ పార్క్ యోగ కేంద్రం లో పెద్ద ఎత్తున నిర్వహించిన వన సమారాధన కార్యక్రమంలో ప్రణవ్ గోపాల్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరంతరం సమాజం కోసం పాటుపడే జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందన్నారు. పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అలాగే విఎంఆర్డిఏ సందర్శినీయ ప్రాంతాల్లో పాత్రికేయులు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పించే విషయమై కమిషనర్ తో త్వరలో మాట్లాడుతానన్నారు.. ఈ విషయమై సంబంధిత అధికారులతో చర్చించి అప్పుడు అధికారికంగా ప్రకటించడం జరుగుతుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన స్థితప్రజ్ఞ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వై వి వి సత్యనారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులతోనే సమాజ ప్రగతి సాధ్యమన్నారు. అలాగే నేటి తరం పిల్లలకు తల్లిదండ్రులు పూర్తిస్థాయిలోఅన్ని అంశాలు పై అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచే విధంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ నగర అధ్యక్షులు పి నారాయణ. కార్యదర్శి జి. శ్రీనివాస్ రావు లు మాట్లాడుతూ ప్రతి యేటా దసరా, దీపావళి,సంక్రాతి,ఉగాది వంటి ముఖ్యమైన పండుగలతో పాటు వనసమారాధన కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ వంతు. సేవలు అందిస్తున్నామన్నారు. ఉదయం అల్పాహారంతో వన సమారాధన కార్యక్రమం ప్రారంభం కాగా మౌనిక పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంబరాన్ని తాకాయి.అలాగే జర్నలిస్టుల కుటుంబ సభ్యుల్లో మహిళలకు పిల్లలకు మెహందీ తో పాటు,ప్రతి ఒక్కరికి డజన్ గాజులు. రవిక, పండ్లు. ఒక గిఫ్ట్ బాక్స్ ను కానుకగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాడ్ కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వర్ రావు, కార్యదర్శి కె.మదన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్, కార్యదర్శి కె శ్రీనివాసరావు. ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు ఆర్గనైజింగ్ సెక్రటరీ ధవలేశ్వరపు రవికుమార్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్, కె. మురళీ కృష్ణ, టి. కృష్ణ మూర్తి నాయుడు,పక్కి వేణు గోపాల్, పట్టెపు నాగేశ్వరరావు గాజువాక యూనిట్ నుంచి రాంబాబు, శిరీష, ఆనంద్, నగేష్ బాబు భీమిలి, పద్మనాభము, మధుర వాడ, గాజువాక, గోపాల పట్నం ప్రాంతాలతో పాటు సుమారు 550 మంది పాల్గొన్నారు.