వైభవంగా సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఆవిష్కరణ వేడుక l#vvwnews

by vvwnews.com

వైభవంగా సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఆవిష్కరణ వేడుక

గాజువాక 6 డిసెంబర్ 2024 – గాజువాకలో పెరుగుతున్న ఆభరణాల ప్రపంచంలోనికి మరో సరికొత్త నగల దుకాణం “సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ” చేరినది. ‘ ఈరోజు గాజువాక అత్యంత కూడలి ప్రాంతంలో “సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ” షోరూం ను శ్రీకన్య గ్రూప్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ కేతవరపు గురుమూర్తి గారు ప్రారంభోత్సవం చేసారు. గాజువాక ప్రాంత ప్రజలకు అద్భుతమైన మరియు ఆకర్షణీయమైన హసకళా నైపుణ్యత ప్రతిబింబించు ఆభరణాలు అందించాలనే లక్ష్యంతో ఈ షోరూం ప్రారంభించినట్లు నిర్వాహకులు ఈ సందర్భంగా వివరించారు.
ఈ నూతనంగా ప్రారంభించిన షోరూం నందు సాంప్రదాయత, కళాత్మకత సమ్మిళితమైన చూడముచ్చట గొలిపే అద్భుతమైన వెండి ఆభరణాలు లభిస్తాయి. చూడగానే ఆకర్షించే బంగారు నగలకు దీటుగా రూపొందిన ఎన్నో రకాల వెండి ఆభరణాలు మిమ్మల్ని మైమరపిస్తాయి షాపింగ్ లో మధురానుభూతిని కలిగిస్తాయి. షోరూం ను నూతనంగా ప్రారంభించిన సందర్భంగా యాజమాన్యం వారు ఖాతాదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. రూ.1,00,000/- కొనుగోలుపైన 1 గ్రాము బంగారు నాణెం, రూ.50,000/- కొనుగోలు పైన అర గ్రాము బంగారు నాణెం మరియు రూ.10,000/- కొనుగోలు పైన 10 గ్రాముల వెండి నాణెం మరియు రూ.5,000/- కొనుగోలు పైన 5 గ్రాముల వెండి నాణెంను ఉచితంగా అందచేస్తారు.
షోరూం ప్రారంభోత్సవానికి విచ్చేసిన చాల మంది ఖాతాదారులు సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ వారు ప్రవేశ పెట్టిన ప్రత్యేక ఆఫర్లు పట్ల హర్షం వెలిబుచ్చారు. ఈ ఆఫర్లు ఎక్కువమందిని ఆకర్షించటమే కాక వెండి ఆభరణాలు కొనుగోలుకు వారిని ప్రేరేపించించి ఆఫర్లు పొందేలా చేసాయి. ఈ పరిమిత కాల ఆఫర్ పొందుటకు ఖాతాదారులు ఉత్సాహం చూపిస్తున్నారు.
సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ప్రారంభోత్సవం లో పాల్గొన్న స్థానిక ప్రముఖులు మరియు అనేక మంది గౌరవ అతిథులు గాజువాక ప్రాంతంలో షోరూం ఏర్పాటు చేయటం ఆనందంగా ఉంది అన్నారు మరియు ప్రవేశ పెట్టిన ప్రత్యేక ఆఫర్లను వారు ప్రశంసించారు. చక్కదనం, శైలి మరియు అత్యుత్తమ హస్తకళ నైపుణ్యత నిండిన వెండి ఆభరణాలను కోరుకునే వారికి ఈ షోరూం వారి కలలను సాకారం చేస్తుందని యాజమాన్యం వర్గం పేర్కొన్నారు. సియా ఫైన్ సిల్వర్ జ్యువెలరీ ఖాతాదారులకు విస్తృత శ్రేణిలో అందంగా రూపొందించిన వెండి ఆభరణాలను అందించుటకు కట్టుబడి ఉంటుంది అన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles