కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల దోపిడీ అరికట్టాలిభారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు

by vvwnews.com

ప్రెస్ నోట్ కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల దోపిడీ అరికట్టాలిభారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు వెంటనే రద్దు చేయాలి ఎన్ ఎఫ్ ఐ ఆర్ టి డబ్ల్యూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి డిమాండ్ కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తేదీ 16 5 2026 ఉదయం 11 గంటలకి అక్కయ్యపాలెం నరసింహ నగర్ రైతు బజార్ రోడ్ లో ఆటో డ్రైవర్లు చిల్లర వత్తులు ముఠా కళాశాలతో నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఎన్ఎఫ్ఐ ఆర్ టి డబ్ల్యూ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐ ఓ సి హెచ్ పి సి ఎల్ భారత పెట్రోలియం ఆయిల్ కంపెనీలు ధరలు పెంచి వాహనదారులు జేబులు కొడుతున్న ఆయిల్ కంపెనీల కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారుడీజిల్ పెట్రోల్ ఎల్ పి జి కమర్షియల్ గ్యాస్ ధరలు భారీగా పెంచి ప్రజల పై ఆర్థిక వేసిందని మండిపడ్డారు పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని సంవత్సరానికి రెండు కోట్ల మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తామని విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని అధికారం చేపట్టి 13 సంవత్సరాల దాటిన ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాలు వేస్తూ బడ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచి పెట్టి పేద ప్రజలపై ఆర్థిక భాహారాలు వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం పోరాడాలని పిలుపునిచ్చారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు37 సార్లు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచిందని మండిపడ్డారు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిలు బేరల ధరలు తగ్గినప్పుడు భారతదేశంలో డీజిల్ పెట్రోల్ పెంచడంతోపాటు వ్యాట్ పన్ను సెస్ పన్నులతో వాహనదారుల జేబులు కొట్టిన ప్రభుత్వం నేడు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం బూస్ చూపించి దేశంలో డీజీలు పెట్రోల్ ధరల భారీగా పెంచడం వల్ల ప్రజల వాడే నిత్యవసరం వస్తువులు ధరల పెరిగి ఆహార భద్రత కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు పెంచినధరలుపై స్థానిక ప్రజాప్రతినిధులు తమ వైఖరిని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు పెరిగిన ధరలకు వ్యతిరేకంగా డ్రైవర్లుపోరాడాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో రావి కృష్ణ జి నీలకంఠం పి సూర్యారావు పి సాయికుమార్ కే నర్సింగ్ రావు ఎం అప్పారావు ఎం ప్రసాద్ బి రమేష్ టి కృష్ణ జి ఆదినారాయణ పి అప్పారావు లుపాల్గొన్నారు ఇట్లు గణేష్ ఆటో స్టాండ్ అధ్యక్షులు పైడిరాజు

Use Social Media to Spread the Word about Our News

related articles