SUTRAA INDIAN FASHION EXHIBITION 30th Nov 1st Dec Novote RK Beach vsp

by vvwnews.com

సంక్రాంతికి సరికొత్త వస్త్రాల సూత్ర ప్రత్యేక ప్రదర్శన
విశాఖపట్నం 29 నవంబర్ 2024 : ఫ్యాషన్ మరియు సంప్రదాయ దుస్తులు కోరుకునే వారి కోసం సూత్రా భారతదేశం నలుమూలల నుండి తెచ్చిన వస్త్రాలతో ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహిస్తున్నాది. మీరు సంక్రాంతి పండుగ కోసం సరికొత్త దుస్తుల కోసం, మీ ఇంటి అలంకరణ వస్తువులు కోసం ఎవరికైనా చక్కని బహుమతి ఇవ్వటం కోసం లేదా వేడుకలను మరింత సంతోషంగా జరుపుకోవటం కోసం చూస్తుంటే తప్పకుండా సూత్రా ప్రదర్శన సందర్శించాలని నిర్వాహకులు చెపుతున్నారు.
సూత్ర ఎగ్జిబిషన్ వైజాగ్‌లోని అత్యంత విలాసవంతమైన నోవాటెల్‌ హోటల్ నందు నవంబర్ 30 & డిసెంబర్ 1 తేదీలలో రెండు రోజులు పాటు ప్రదర్శనను నిర్వహిస్తునట్లు ప్రకటించారు. సూత్రా యొక్క క్యూరేటెడ్ కలెక్షన్‌లో ప్రతి ఒక్కరిని ఆకర్షించే వస్తువు ఏదో ఒకటి ఉంటుంది. ఈ సూత్రా ప్రదర్శనలో మరెక్కడా లేని విధంగా పండుగ షాపింగ్ లో గొప్ప అనుభూతిని పొందవచ్చును. గృహాలంకరణ వస్తువులు, హస్తకళానైపుణ్యతతో రూపొందించిన చీరలు, లెహంగాలు, ఆధునిక ఫ్యాషన్ దుస్తులు, సొగసైన ఆభరణాలు మరెన్నో అపూర్వ ఉత్పత్తులు మీకు లభిస్తాయి. మీ పండుగలు వేడుకలను మరింత సంతోషభరితంగా జరుపుకోవటానికి ఆకర్షణీయ ఉత్పత్తుల కొరకు ఈ ప్రదర్శనలో అన్వేషణ చేయవచ్చునని నిర్వాహకులు చెపుతున్నారు. సూత్ర ప్రదర్శనలో దుస్తులు, గౌన్లు, చీరలు, పాదరక్షలు, ఉపకరణాలు తోపాటుగా డిజైనర్ ఉత్పత్తుల విస్తృత శ్రేణిని ప్రదర్శిస్తారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 40+ ఎగ్జిబిటర్లు ప్రత్యేక సేకరణలను ప్రదర్శిస్తారు. ప్రదర్శనలో ప్రదర్శించబడిన కొంతమంది డిజైనర్లు: వెర్వ్ విస్టా, గాల్స్ గ్యాలరీ, హ్యాండ్ లూం హౌస్ , అవమా జ్యువెలర్స్-కోల్‌కతా, డిల్లీ హాట్, V స్టూడియో, ఆభూషణ్ వన్, కృతి బోటిక్, స్వీజా జ్యువెలరీ, ది జిగ్స్ కలెక్షన్ – ముంబై, సంపూర్ణ ఆభరణాలు, జై మహంకాళి క్రియేషన్స్, తారా జ్యువెలరీ మొదలైనవి.
మీ సంక్రాంతి పండుగ వేడుకలను సంతోషంగా కలకాలం గుర్తుండిపోయేలాగ మరింత శోభాయమానంగా మరియు ఆధునిక ఫ్యాషన్ల శైలిలో జరుపుకొనుటకు మరపురాని షాపింగ్ అనుభవం పొందుటకు మా సూత్రా ప్రదర్శనను సందర్శించమని నిర్వాహకులు కోరుచున్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles