29 నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ షో నిర్వహణ
వేదిక : గాదిరాజు ప్యాలస్
– మూడు రోజుల పాటు
నిర్వహణ
ఎం వి పీ కాలనీ
(విశాఖ తూర్పు):
నగరంలోని ఎంవిపి కాలని గాది రాజు ప్యాలస్ లో నవంబర్ 29వ తేదీ శుక్రవారం నుంచి డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం వరకు మూడు రోజుల పాటు తమ 10వ ప్రాపర్టీ ఎక్స్ పో నిర్వహిస్తున్నట్లు విశాఖపట్నం క్రెడాయ్ చైర్మన్ కెఎస్ఆర్కె రాజు(సాయి) తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు తెలిపేందుకు గురువారం ఎంవిపి కాలని గాదిరాజు ప్యాలస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నవంబర్ 29వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు గాదిరాజు ప్యాలస్ లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఈ 10వ ప్రాపర్టీ ఎక్స్ పో కార్యక్రమం ప్రారంభమవు తుందన్నారు. మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాపర్టీ ఎక్స్ పో లో నగరంలోని సుమారు 70కి పైగా ప్రముఖ నిర్మాణరంగ సంస్థలు పాల్గొని తమ వ్యాపార కార్యకలాపాలను వినియోగ దారులకు ప్రదర్శిస్తా రన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ, యుబిఐ, ఎల్ఐసి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐడిఎ తదితర జాతీయ బ్యాంకులు కూడా ఫాల్గొంటా యన్నారు. ఈ ఎక్స్ పో లో 7 ప్రముఖ స్టీల్ కంపెనీలు, 35 ఇంటీరియర్ అండ్ ఎక్స్ టీరియర్ కంపెనీలు కూడా ఫాల్గొంటా యన్నారు. ఈ ఎక్స్ పో లో పాల్గొనే వినియోగ దారుల కోసం ప్రతి గంటకు ఒక సారి లక్కీ డిప్ తీసి మంచి బహుమతులు కూడా అందిస్తా రన్నారు. మొత్తం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఈ ప్యాలెస్ లో 71 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నా మన్నారు. ఈ ఎక్స్ పో – 2024 కన్వీనర్ సి.హెచ్.గోవిందరాజు మాట్లాడుతూ, విశాఖ నగరానికి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్, దీనికి మంచి కనెక్టివిటీ రోడ్, అవసరమైన ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, మెట్రో రైలు ప్రాజెక్టు, నగరంలోని అంతర రహదారులు తదితర మౌళిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తే విశాఖ నగరం జాతీయ స్థాయిలో మంచి అభివృద్ధి చెందే నగరంగా రూపుదాల్చి రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ లా తయారవు తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కూటమి ప్రభుత్వం నిర్మాణ రంగానికి సంబంధించి పలు సంస్కరణలు తీసుకు వచ్చి తమకు మేలు చేస్తోందన్నారు. భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, విఎల్టీ, టిడిఆర్ తదితర అనుమతులు సింగిల్ విండో పద్ధతిలో ఇచ్చేందుకు వీలుగా ఈజీ డూఇంగ్ బిజినెస్ కోసం డిసెంబర్ 31వ తేదీన సమగ్రమైన జిఒ రాష్ట్ర ప్రభుత్వం తేనుందన్నారు. ఇసుక కూడా ప్రస్తుతం ఉచితంగానే అందుబాటులోకి వచ్చిందన్నారు. లేబర్ ఛార్జ్, రవాణా ఖర్చులు మాత్రమే వినియోగ దారులు భరించా లన్నారు. విశాఖ నగరానికి టిసిఎస్, ఇన్ఫోసిస్ తదితర పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు రానుండటం శుభ పరిణామ మన్నారు. మీడియా సమావేశంలో సంస్థ గౌరవ కార్యదర్శి వి.శ్రీను, వైస్ ప్రెసిడెంట్ ఈ.అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.