రోడ్డు ప్రమాదాల నివారణకే హెల్మెట్ లు పంపిణీ
జర్నలిస్టులకు శక్తిమేర సాయం అందిస్తా
ఫెడరేషన్ ఆధ్వర్యంలో 8న కార్తీక వన సమారాధన
సీతంపేట, నవంబర్ 24
నగరంలో జర్నలిస్టులకు తన శక్తిమేర సహాయం అందిస్తానని ఏపి ఫిల్మ్ ఇండస్ర్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ , ఉపకార్ చారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ పౌరగ్రంథాలయంలో ఏపి వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపి బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపి స్మాల్ అండ్ మీడియమ్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విశాఖ యూనిట్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ రాష్ర్టంలో రోడ్డు ప్రమాదాలు అత్యధికంగా జరుగుతున్నట్లు గుర్తించానన్నారు. అయితే విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు తన వంతుగా జర్నలిస్టులకు ఉచితంగానే హెల్మెట్ లు అందజేస్తున్నామన్నారు. ఇప్పటికే కొంత మంది జర్నలిస్టులకు అందజేయడం జరిగిందని భవిష్యత్తులో కూడా మరిన్ని హెల్మెట్ లు అందిస్తామన్నారు. అప్పటికి ఎవరికైనా హెల్మెట్ అందకపోతే తమ ఉపకార్ ట్రస్టు కార్యాలయంలో సంప్రదించి ఉచితంగా తీసుకోవచ్చునన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా జర్నలిస్టులకు సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. అయితే చలన చిత్ర నిర్మాతగా తన వంతు సహాయం చేయాలని నిర్ణయించి అందులో జర్నలిస్టులు, కళాకారులు, నిరుపేదలకు తన పరిధి మేరకు సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా తన ట్రస్టు సేవలు కొనసాగుతాయన్నారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, విశాఖ అర్బన అద్యక్షులు పి.నారాయణ్ లు మాట్లాడుతూ ఉమ్మడి విశాఖలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. అలాగే ఇళ్ల స్థలాల సమస్యపై కూడా నిరంతరం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. అలాగే పెండింగ్ సమస్యలపై కూడా తమ రాష్ర్ట కార్యవర్గం దృష్టిసారించిందన్నారు. డిసెంబర్ 8న శివాజీపార్కులో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా కార్తీక వనసమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వీరు చెప్పారు. ఆ రోజు ఉదయం నుంచి అల్పాహారంతో ప్రారంభమై సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీడిప్ కొనసాగుతాయన్నారు. మధ్యాహ్నం విందు భోజనం అనంతరం ఇతర కార్యక్రమాలుతో ముగుస్తాయన్నారు. ఇందుకు సంబంధించి తమ కార్యవర్గం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ నగర కార్యదర్శి జి.శ్రీనివాసరావు, బ్రాడ్ కాస్ట్ నగర అధ్యక్ష, కార్యదర్శులు, ఇరోతి ఈశ్వరరావు, మధన్, స్మాల్ అండ్ మిడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు జగన్మోహన్, కె.శ్రీనివాసరావు, అర్బన్ యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దవళేశ్వరం రవికుమార్, ఉపాధ్యక్షులు బండారు శివప్రసాద్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వై. రామ కృష్ణ, నాయుడు, శేషు, శర్మ, త్రినాధ్ ఆయా కార్యవర్గాల సభ్యులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకే హెల్మెట్ పంపిణీ జర్నలిస్టులకు సాయం అందిస్తా శ్రీ కంచర్ల కంచర్ల అచ్యుతరావు
50
previous post