*మోడీ విశాఖ పర్యటన లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేయాలి.*
👉🏻 *సీఐటీయూ*
భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు 29వ తేదీన విశాఖపట్నం పర్యటనకు వస్తున్నట్లు తెలిసింది. ఈ పర్యటన సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం లేదని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని దాన్ని సెయిల్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించాలని సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్ డిమాండ్ చేశారు. ఈ ప్రకటన చేయకపోతే ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలకి తీరని ద్రోహం చేసి నట్లేనన్నారు. ఈరోజు ఉదయం 10:30 కు జీవీఎంసీ గాందీ విగ్రహం నుండి సిఐటియు ఆధ్వర్యంలో నవంబర్ 26 కార్మిక కర్షక ప్రదర్శనను జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను సరవేగంగా అమలు జరుపుతుందన్నారు అందులో భాగంగానే స్టీల్ ప్లాంట్ తో పాటు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కారు చవకగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతుందన్నారు. ఈ ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా విశాఖలో కార్మిక వర్గం ప్రజలు గత 1400 రోజుల నుండి ఐక్యంగా పోరాడుతున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి విధానాల వలన కార్మిక వర్గం రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. కార్మికులను బానిసలుగా చేసేటటువంటి లేబర్ కోడ్స్ ను తీసుకొని వచ్చి యాజమాన్యాలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందన్నారు. తన అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదాని పీకల్లోతు అవినీతిలో కొడుకు పోయాడని అతని తక్షణమే అరెస్టు చేసి చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోవాలని అతనితో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం నెలకు 26 వేల రూపాయలు చెల్లించాలని వివిధ ప్రభుత్వ స్కీమ్స్ లో పనిచేస్తున్న అంగన్వాడి ఆశ మధ్యాహ్నం భోజనం పథకం వివోఎ , ఆర్పి తదితరులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు అసంఘటిత రంగమైన ఆటో భవన నిర్మాణం తోపుడుబల్లు ముఠా కళాశాలకు పిఎఫ్ ఈఎస్ఐ తో కూడిన సమగ్ర చట్టం చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, ఈపీఎస్ 95 కార్మికులకు కనీస పెన్షన్ 9000 రూపాయలు అమలు చేయాలని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని విద్యుత్తు సంస్కరణను రద్దు చేయాలని అధిక ధరలు నియంత్రించాలని డిమాండ్ చేశారు సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక కర్షకులకు మోడీ విధానాల వలన తీవ్ర నష్టం వాటిలోతుందని అందుకనే నవంబర్ 26వ తేదీ నాడు దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు సంయుక్త కిషన్ మార్చా పిలుపు మేరకు భారీ ప్రదర్శనలో సభలు జరుగుతున్నాయని విశాఖలో 26వ తేదీ ఉదయం దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కార్మిక ప్రదర్శన అనంతరం సభ జరుగుతుందన్నారు దీంతో పాటు గాజువాకలో ఈనెల 24వ తేదీన రేపు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పాత గాజువాక నుండి భారీ కార్మిక ప్రదర్శన సభ జరుగుతుందన్నారు. కావున కార్మిక వర్గం యావన్మంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు బైక్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఈ బైక్ యాత్ర జీవీఎంసీ వద్ద ప్రారంభమై రామ్ నగర్ జడ్జి కోర్ట్ జగదాంబ వాచ్ హౌస్ పూర్ణ మార్కెట్ కొత్త రోడ్ మీదుగా తిరిగి సరస్వతీ పార్క్ డాబా గార్డెన్స్, అంబేద్కర్ విగ్రహం ఎల్ఐసి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆసీలుమిట్ట మీదుగా తిరిగి జీవీఎంసీ వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎఫ్ టి యు కార్యదర్శి దేవా సిఐటియు నాయకులు వై రాజు, ఎం సుబ్బారావు, పి వెంకట్ రెడ్డి, జి అప్పలరాజు, పి వెంకట్రావు, ఉరుకుటి రాజు టీ నూకరాజు, ఏ సింహాచలం,వి. వి కృష్ణారావు ఏ అప్పారావు కుమారి తదితరులు పాల్గొన్నారు
ఇట్లు
Rksv.కుమార్
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి.
మోడీ పర్యటన లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకున్నట్లు ప్రకటన చేయాలి
55