రోడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత.
ఏజెన్సీ గ్రామాలకు బ్రిడ్జి నిర్మాణాలతో పాటు రోడ్డు నిర్మాణ పనులు.
అంగన్‌వాడీలో పిల్లలకు ఐదు రకాల ఫ్రీ స్కూల్ మెటీరియల్ పంపిణీ.
కల్లు గీత కార్మికులకు కటమయ్య
సెప్టి కిట్స్ పంపిణి.
ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం.
5 కోట్ల 45 లక్షల నిధులతో రోడ్ల
ప్రత్యేక మరమ్మతు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క
తేది.20.11.2024.
వెంకటపూర్ మండలం.
ములుగు జిల్లా.
*****
రోడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, పంచాయతీరాజ్ శాఖ ద్వారా చేపట్టనున్న నూతన రోడ్ల నిర్మాణ పనులను త్వరత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
బుధవారం వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన రోడ్ల ప్రత్యేక మరమ్మతుల పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతొ కలసి శంకుస్థాపన చేశారు.
అనంతరం లక్ష్మి దేవిపేట గ్రామము లోని అంగన్వాడీ కేంద్రము లో రాష్ట్రములో మొట్ట మొదటి సారిగా అంగన్వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక విద్యా పరికరాలు ఎక రూప దుస్తుల పంపిణీ ప్రారంభించడం లో భాగంగా
అంగన్వాడి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడమే కాకుండా ఐదు రకాల ఫ్రీ స్కూల్ మెటీరియల్ పంపిణీ మంత్రి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టడానికి నిర్ణయం తీసుకొని నిధులు సైతం కేటాయించడం జరిగిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లను జాతీయ రహదారులకు అనుసంధానం చేయడానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రోడ్డు సౌకర్యం ఏర్పడినప్పుడే వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది వసతుల కల్పన అభివృద్ధి చెందుతుందని అన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ప్రకటించడంతో పాటు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఇప్పటివరకు 20 లక్షల మందికి రైతుల రుణాలు మాఫీ చేసామని, రానున్న రోజులలో రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని అన్నారు.
రాష్ట్రములో మొట్ట మొదటి సారిగా అంగన్వాడీ కేంద్రాల పూర్వ ప్రాథమిక విద్యా పరికరాలు ఎక రూప దుస్తుల పంపిణీ ప్రారంభించడం లో భాగంగా , గతములో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి పిల్లలకి యూనిఫామ్ ఇవ్వడమే కాకుండా ఐదు రకాల ఫ్రీ స్కూల్ మెటీరియల్ ఇవ్వడం జరిగిందనీ,
ప్రైవేట్ స్కూల్ దీటుగా ఇంగ్లీష్ మీడియం చెప్పడం జరుగుతుందనీ, పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని ఆమె అన్నారు.
ఈ సందర్భంగా అక్షరాభ్యాసం, అన్నప్రాసన గర్భిణీ స్త్రీలకు సీమంతం చేశారు.
ఈ కార్యక్రమాల్లో జిల్లా శిశు సంక్షేమ అధికారిని కె. శిరీష,
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడా కుల అశోక్ మరియు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానో త్ రవి చందర్ మండల అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ సూపర్ వైజర్లు , టీచర్లు, లబ్ధి దారులు, గర్భిణీ స్త్రీలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.