*పైలా శివతేజ జయంతి సందర్బంగా పైలా శివతేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో పలు సేవా కార్యక్రమాలు*
విశాఖపట్నం, నవంబర్ 18
సీనియర్ పాత్రికేయుడు పైలా దివాకర్ కుమారుడు దివంగత పైలా శివతేజ 31 వ జయంతి సందర్బంగా పైల శివతేజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్బంగా రైల్వే న్యూ కాలనీ కూడలి వద్ద అన్నార్తులకు ఉదయం అల్ఫాహారం పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో పైల దివాకర్, వెంకట రమణి దంపతులతో పాటు ప్రముఖ సంఘ సేవకులు నారా నాగేశ్వరావు, పైలా శివతేజ స్నేహితులు పాల్గొని శివతేజ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం షిర్డీ సాయి ధ్యాన మందిరం వద్ద ఆల్ఫహారాన్ని పంపిణి చేసారు. ఈ సందర్బంగా దివాకర్ మాట్లాడుతూ తన కుమారుడు అతి చిన్న వయసులోనే రోడ్డు ప్రమాదం భారిన పడి అశువులుబాసాడన్నారు.ఆనాటి నుంచి నేటి వరకు రోడ్డు ప్రమాదల నివారణ,రొడ్ సేఫ్టీ పై అనేక అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. యువత వాహనాలు నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతీ యేటా శివతేజ జయంతి, వర్ధంతి కార్యక్రమం పలు సేవా కార్యక్రమాల మధ్య నిర్వహించుకోవడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు.అంతేకాక విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జర్నలిస్ట్ల పిల్లలకు శివతేజ ఎక్సలెంట్ అవార్డు తో పాటు నగదు బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఈరోతి ఈశ్వరరావు, ఎం. ఎస్. అర్. ప్రసాద్, సత్య మహారాణా,గాజుల ప్రసాద్,డా. వినోద్,సదరం సునీల్ సాయి,కొప్పు నిఖిల్, సుదర్శన్, గిరిస్వామి, చెరుకు శ్రీనివాస్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.