నవంబర్ 19 న హనుమకొండ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో ప్రజా పాలన విజయోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క
*కేటీఆర్ వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్*
మీకే మూటలు మోసే అలవాటు ఉంది. తెలంగాణ పేరుతో దేశంలోనే ఎక్కువ ఆదాయం సమకూర్చుకున్న ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్
ఇతర రాష్ట్రాల్లో పార్టీ లేకున్నా మూటలు తీసుకుని పోయి ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ ది
కులాలను, మతాలను, వర్గాలను రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ పని
బీజేపీ దుర్మార్గ పాలన కు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేసేందుకు పోరాడుతున్న కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కావాలనే టార్గెట్ చేసింది
ప్రభుత్వ పథకాల మీద దుష్ఫ్రచారం చేస్తున్నారు
అధికారం, రాజకీయం తప్ప బీఆర్ఎస్ కు మరో యావ లేదు
బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ప్రగతి సభను నిర్వహిస్తాం
జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు, సంక్షేమ నిధులు కల్పించేందుకే కుల గణన సర్వే నిర్వహిస్తున్నాం
గత ప్రభుత్వం కేవలం లిమ్కా బుక్ రికార్డుల కోసం ఒక రోజులోనే సర్వేను ముగించింది
కనీసం సర్వే వివరాలను బయట పెట్టలేదు
సర్వే ఆదారంగా ఉద్యోగాలు, ఉపాధి, రిజర్వేషన్లు పెంచలేదు
సామాజిక, రాజకీయ, ఆర్దిక, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగు పరించేందుకు మేము సర్వే నిర్వహిస్తుంటే అడ్డుకోమని పిలుపునిస్తారా?
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు సర్వే చేపడితే బీఆర్ఎస్ ఓర్వ లేకపోతుంది
ఏడాదికాలంలో ప్రజా ప్రభుత్వం చేసిన మంచి పనులు వివరిస్తాం
రైతులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున సభ కు తరలి వచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ,స్థానిక ఎంఎల్ఏ నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ములుగు జిల్లా అధ్యక్షులు పైడా కుల అశోక్
ములుగు గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ తో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు