ఉసిరి మారేడు,మర్రి చెట్లు నాటి పెంచండి ఎకో వైజాగ్ ను విజయవంతం చేయండి

by vvwnews.com

ఉసిరి, మారేడు, మర్రి చెట్లు నాటి పెంచండి
– ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలి.
– ప్రతి పండుగకూ ఒక దేవతా వృక్షాన్ని నాటి పెంచాలి.
ఎకో వైజాగ్ ను విజయవంతం చేయాలి
– జలగం కుమార్ స్వామి భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు
కార్తీక మాసం లో ప్రతి ఒక్కరూ ఉసిరి, మారేడు, మర్రి చెట్లు నాటి పెంచండి అని భారత కిసాన్ సంఘ్ జాతీయ కార్యవర్గ సభ్యులు జలగం కుమార్ స్వామి కోరారు. శుక్రవారం సాయంత్రం ఎంవిపి కాలనీలోని ఎస్ వి వి పి డిగ్రీ కళాశాలలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం నేతృత్వంలో మొక్కలు నాటిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ప్రతి పండుగకూ ఒక దేవతా వృక్షాన్ని నాటి పెంచాలని అన్నారు. ఎకో వైజాగ్ ను విజయవంతం చేయడం ద్వారా నగర వాసులు అందరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. వనభోజనాలు నిర్వహించి మన ఐక్యతను చాటి చెప్పే మనం కలిసికట్టుగా మొక్కలు నాటి పెంచాలని అన్నారు.
ఎస్ వి వి పి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలి అన్నారు. తమ విద్యా సంస్థలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి నిరంతరం చేస్తున్నాం అని వివరించారు. విద్యార్థులు అంతా పర్యావరణ పరిరక్షణకు కొంత సమయం కేటాయించాలి అని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థినులు బి ఉషారాణి, బి తేజస్విని చైతన్య, గాంబియా దేశానికి చెందిన సోషల్ వర్క్ విద్యార్థిని అడార్ బి సార్, సోషల్ వర్కర్లు జె రాజేశ్వరి, ఇ కృష్ణ కుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles