ప్రెస్ నోట్ ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తేదీ 12 11 2024 మధ్యాహ్నం 12 గంటలకు జీవీఎంసీ ఎదురుగా ఆటో డ్రైవర్ల నిరసం ధర్నా జరిగినది ఈ కార్యక్రమం ఉద్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ ఆటో డ్రైవర్ కు పీఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు ప్రభుత్వం చేయాలని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 16న విజయవాడలో జరిగే ఆటో డ్రైవర్ మహా ధర్నాలు పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ఆటో డ్రైవర్లకు పిలుపునిచ్చారు భారీగా పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ విద్యుత్ చార్జీలు బియ్యం పప్పులు వంటనూనె ధరలు తగ్గించే ఆటో డ్రైవర్ కు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు జిల్లా ప్రధాన కార్యదర్శి పడాల్ గోవింద్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21 31 రద్దు చేయాలని ఆటో డ్రైవర్ వాహన మిత్ర వెంటనే అమలు చేయాలని డ్రైవర్ల మీద ఉన్న పోలీస్ ఆర్టీవో ఈ చలనాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని నిచ్చరించారు కార్యక్రమంలో స్టాండ్ అధ్యక్షులు వై వెంకట్ హెచ్ శేఖర్ ఎంఏ ఖాన్ కేలం శివ ఎం మధు రెడ్డి రావికృష్ణ ఎస్ చెన్నారెడ్డి అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు వై వెంకట్
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే చంద్రబాబు నాయుడు నెరవేర్చాలి అని AITUC డిమాండ్
51