ప్రెస్ నోట్
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపటి నుండి సిపిఎం ప్రజాపోరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం విశాఖజిల్లాలో 8 నుండి 14వరకు ప్రజాపోరు నిర్వహిస్తుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.కె.ఎస్.వి.కుమార్ తెలిపారు.
గురువారం జగదాంబ వద్ద గల సిపిఎం జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ బి.గంగారావు, బి.జగన్, పి.మణి, వి.కృష్ణారావులతో కలిసి ప్రజాపోరు పోస్టర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బిజెపి, రాష్ట్ర టిడిపి కూటమి ప్రభుత్వాలు ధరలు అదుపుచేయటానికి ఎటువంటి చర్యలు లేవన్నారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం చేయడంతో పాటు విద్యుత్ భారాలు భారీగా పెంచిందన్నారు. ఉచిత ఇసుక అమలు, ఖాళీపోస్టులు భర్తీ, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, లేబర్‌కోడ్స్ రద్దుచేయాలని తదితర డిమాండ్లతో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 8వ తేదీ నుండి 14వరకు ఇంటింటికి కరపత్రాలు పంపిణీ, పాదయాత్రలు, గ్రూపు మీటింగులు, సచివాలయాల వద్ద నిరసనలు చేపట్టి 14న ఎమ్మార్వో ఆఫీస్‌ల ఎదుట ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఇట్లు
ఎం.జగ్గునాయుడు
కార్యదర్శి
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రేపటినుండి సిపిఎం పార్టీ ప్రజా పోరు
49