7 నుంచి ఇసికాన్ సదస్సు || నోవాటేల్ హోటల్ వేదిక || ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

by vvwnews.com

7 నుంచి ఇసికాన్ సదస్సు

*నోవాటేల్ హోటల్ వేదిక

*ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

విశాఖ సిటీ…..:

విశాఖలో ఈ నెల 7 నుంచి 10 వరకు ఇసికాన్ జాతీయ స్థాయి సదస్సు జరుగుతుందని సదస్సు కార్యనిర్వహక కార్యదర్సి డాక్టర్ కే ఏ వీ. సుబ్రహ్మణ్యం తెలిపారు. కేజీహెచ్ లో గల సూపర్ స్పెషాలిటీ బ్లాకులో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సు తొలి రోజు పీజీలకు జరిగే వర్క్ షాపులో
మధుమేహం తదితర అంశాల మీద సేషన్ వుంటుందన్నారు. అమెరికా, దుబాయ్, ఇంగ్లాండ్ తదితర దేశాల నుంచి ఫ్యాకల్టీ వైద్యులు వస్తారని తెలిపారు. ఈ నెల 9 న ఉదయం 6 గంటలకు వాక్ ధాన్ జరుగుతుందన్నారు. ఆర్ కే బీచ్ రోడ్డు కాళి మాత గుడి వద్ద
జరుగుతుందన్నారు. ఈ నెల 8 న సాయంత్రం 6.30 గంటలకు జరిగే ప్రారంభోత్సవంలో మాజీ ఉప రాష్ర్స్ట్ర పతి ఎం.వెంకయ్య నాయుడు పాల్గొంటారన్నారు.సదస్సు చైర్మన్ డాక్టర్
దిలీప్ కుమార్ మాట్లాడుతూ, తాను గతంలో జాతీయ సదస్సు అధ్యక్షుడుగా పని చేసినట్లు తెలిపారు.1971లో ఎండో క్రాన్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఈఎస్ఐ ) స్థాపన జరిగిందని గుర్తు చేశారు.
ఇది 53 వ సదస్సు విశాఖలో తొలిసారిగా జరుగుతుందన్నారు. జూనియర్ వైద్యులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. షుగర్, డైరాయిడ్, మెడ వద్ద వ్యాపు, లింగ ధారణ వ్యాదులు, ఎముకల క్షీణత ఇటీవల వచ్చిన ఆధునిక చికిత్స గురించి కూడా చర్చిస్తారన్నారు. సదస్సులో 500 మంది వరకు జూనియర్ వైద్యులు, రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొంటారు అని వివరించారు. సదస్సు సైంటిఫిక్ చైర్మన్
డాక్టర్ మైధిలి మాట్లాడుతూ, రాష్ట్రంలో తొలిసారిగా సదస్సు జరగడం విశేష మన్నారు. శరీరంలో గ్రంధులు ఎలా పని చేస్తాయి వంటి అంశాల మీద చర్చిస్తా మన్నారు. మూడు రోజుల పాటు జరిగే సదస్సులో పలు అంశాలు మీద 250 మంది వైద్యులు ఫ్యాకల్టీగను, 200 మంది ప్రతినిధులు పాల్గొంటారని వివరించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles