ఇంటి పై కప్పు పై ప్రతి ఒక్కరు తోటలు పెంచాలి వనమాలి సిటిజి గార్డెన్స్ సంస్థలు & గ్రీన్ క్లైమేట్ టీం

by vvwnews.com

ఇంటి పై కప్పు మీద ప్రతీ ఒక్కరూ తోటలు పెంచాలి
– ఎకొ వైజాగ్ లో బాగంగా నారు, విత్తనాలు పంపిణీ
– మిద్దె తోటల మీద నగరవాసులు అందరికీ అవగాహన అవసరం
– వనమాలి, సిటిజి గార్డెనింగ్ సంస్థలు
ఇంటి పై కప్పు మీద ప్రతీ ఒక్కరూ తోటలు పెంచాలి అని వనమాలి, సిటిజి సంస్థలు శంబువానిపాలెంలో ఆదివారం ఆర్ ఎస్ ఎస్ నిర్వహించిన కార్యక్రమంలో ఒక స్టాల్ లొ ఆకుకూరలు, కూరగాయ మొక్కల నారు పంపిణీ చేశారు. “ఇచ్చి పుచ్చుకునే” విధానం లో కూరగాయల మొక్కలు, అంట్లు, విత్తనాలు పంపిణీ చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు నాదెళ్ల జ్యోతి, మళ్ళ సరిత కోరారు. ఎకొ వైజాగ్ లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కూరగాయ మొక్కలకు సంబంధించి బత్తిలి, వెల్లంకి వంగనారు, గుంటూరు మిర్చి నారు, నాటు టమాటా, కారం బంతి నారు పంపిణీ చేశారు. మిద్దె తోటల మీద నగరవాసులు అందరికీ అవగాహన అవసరం అని తాము నగరం లో ప్రతి నెలా అవగాహన కార్యక్రమాలు నగరం అంతటా నిర్వహిస్తున్నాం అని సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. రసాయన ఎరువులు, రసాయన క్రిమి సంహారకాలు, రసాయన కలుపుతీత ముందులతో పండిస్తున్న ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వల్ల కలిగే నష్టాలు వివరించి ప్రతి ఒక్కరినీ సభ్యులుగా చేరాలని కోరారు. ఎవరి ఇంటి వద్ద వారు కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించి ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద ఆకుకూరలు, కూరగాయలు పెంచడానికి తాము కృషి చేస్తున్నామన్నారు.
ప్రధానంగా నగరం లో మురళీ నగర్, ఎండాడ, మద్దిలపాలెం, గోపాలపట్నం, పెందుర్తి, ఎన్ ఎడి కొత్త రోడ్డు, ఒన్ టౌన్, ద్వారకా నగర్, అక్కయ్య పాలెం, సీతమ్మ ధార, ఎంవిపి కాలనీ, కూర్మన్న పాలెం, గాజువాక ల్లో వనమాలి సిటిజి గార్డెనర్స్ గ్రూప్ ల టీం లో సభ్యులు ప్రతి నెలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తమను సంప్రదించవలసిన మొబైల్ నెంబర్లు 7794930439, 8121382753, 8500874103 గా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మాంబిక, దేవికి, లావణ్య, రత్నం, కృ‌ష్న తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles