సింహాచలంలో ఘనంగా దీపావళి వేడుకలు అప్పన్న తొలి పావంచ వద్ద పూజల్లో పాల్గొన్న గంట్ల శ్రీనుబాబు

by vvwnews.com

*సింహాచలంలో ఘనంగా దీపావళి వేడుకలు*
*అప్పన్న తొలి పావంచ వద్ద పూజల్లో పాల్గొన్న గంట్ల*
సింహాచలం, నవంబర్ 1: సింహాచలం దేవస్థానం కొండ దిగువన తొలి పావంచ వద్ద దీపావళి వేడుకలు గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. స్వామి పాదాల చెంత స్థానిక ప్రజలు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తొలిపావంచ వద్ద దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయ సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పాల్గొని దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ దీపావళి సందర్భంగా ప్రతీ యేటా స్వామి వారి పాదాలు చెంత దీపాలు వెలిగించి వేడుకల్లో పాల్గొని పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దేశం లో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో ఉండటంతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా సుఖంగా, ఆరోగ్యంగా ఉండాలని దేవునికి పూజలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగానే స్థానిక ప్రజలతో కలిసి బాణాసంచా కాల్చి సందడి చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles