ఘనంగా న్యూహోప్‌ ఫౌండేషన్‌ 9వ వార్షికోత్సవ వేడుకలు #vvwnews

by vvwnews.com

ఘనంగా న్యూహోప్‌ ఫౌండేషన్‌ 9వ వార్షికోత్సవ వేడుకలు

విశాఖపట్నం : విశాఖలో న్యూహోప్‌ ఫౌండేషన్‌ తొమ్మిదోవ వార్షికోత్స వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు కళా, సాహితీ, జర్నలిజం, సేవారంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఫౌండేషన్‌ వ్యవస్ధాపకరాలు డాక్టర్ ఎం నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఎ ఎం ఎ ఎ హై స్కూల్ , కరెస్పాండంట్ రాజాబాబు, శివరామ రెడ్డి స్వీట్స్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా న్యూహోప్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలువురుని గుర్తించి వారిని సత్కరించడం అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో ఈ ఫౌండేషన్‌ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఫౌండేషన్‌ వ్యవస్ధాపకురాలు నాగమల్లేశ్వరి మాట్లాడుతూ అందరి సహకారంతోనే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏటా చేయడం ఆనందంగా ఉందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, వైద్యులు, జర్నలిస్టులు ఇలా వంద మంది వరకూ సేవాపరులను గుర్తించి వారిని సత్కరించామన్నారు. .

Use Social Media to Spread the Word about Our News

related articles