ఆటో డ్రైవర్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి AITUC

by vvwnews.com

ప్రెస్ నోట్ ఆటో డ్రైవర్ కు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగు నిరసనలో భాగంగా తేదీ 29 10 2024 ఉదయం 10 గంటలకి ఆర్టీసీ కాంప్లెక్స్ ఇన్ గేట్ వద్ద ఆటో డ్రైవర్ల నిరసన ధర్నా జరిగినది ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామ న మూర్తి మాట్లాడుతూ ఎన్నికలలో చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కరిస్తామని జీవో నెంబర్ 21 మరియు 31 రద్దు చేస్తానని డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గిస్తామని డ్రైవర్లకు వాహన మిత్ర 15 వేల రూపాయలు ఇస్తామని వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలు గడిచిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు ఎప్పటికైనా చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు డ్రైవర్ల అందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని రాష్ట్రంలో ఆర్ అండ్ బి రోడ్డులో టోల్ గేట్లు పెట్టాలన్న ప్రతిపాదన ప్రభుత్వం విరమించాలి ఆటోలు మోటార్ వాహనాల ఎఫ్ సీలు ప్రైవేటు సంస్థలకు వ్యక్తులకు ఇచ్చే ప్రతిపాదన రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆటోల మీద ఉన్న పోలీస్ ఆర్టీవో ఈ చలానాలు రద్దుచేసి ఆటో డ్రైవర్ జీవన ఉపాధి కల్పించాలని కోరారు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రమాదకరంగా ఉన్న రోడ్లు పక్కాగా వేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు భారీగా పెంచిన విద్యుత్తు బియ్యము పప్పులు వంటనూనె కాయగూరల ధరలను నియంత్రించేందుకు ప్రజాప్రతినిధులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ లేనిపక్షంలో ప్రజా ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈధర్నాలో రావికృష్ణ కేలం శివ శంకర్ అప్పలరాజు నూకరాజు తదితరులు పాల్గొన్నారు ఇట్లు స్టాండ్ అధ్యక్షులు అప్పలరాజు

Use Social Media to Spread the Word about Our News

related articles