కేజీహెచ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుల జీతాలను వెంటనే డిమాండ్ #vvwnews

by vvwnews.com

కేజీహెచ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుల జీతాలను వెంటనే చెల్లించాలని కేజీహెచ్ సెక్యూరిటీ గార్డ్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. జీతాలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్, ఆసుపత్రి సూపరిండెంట్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యూనియన్ నేతలు కర్రి చంద్రశేఖర్, పి.మణి, చంద్రమౌళి వై రాజు, సుబ్బారావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ గత రెండు నెలలుగా సెక్యూరిటీ గార్డులకు జీతాలు చెల్లించలేదని తెలిపారు. కాంట్రాక్టర్ కు ఆసుపత్రి సూపరింటెండెంట్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. కార్మికుల నుండి తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్న కాగితాలను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సక్రమంగా చెల్లించాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తామని కార్మిక నేతలు హెచ్చరించారు.

Use Social Media to Spread the Word about Our News

related articles