యువత శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చెయ్యాలి .
– యువత పర్యావరణ హితంగా జీవించాలి.
– విద్యార్థులు మొక్కలు నాటి పెంచాలి. చెట్లను కాపాడుకోవాలి
– మట్టి ప్రమిదలు విద్యార్థులు తయారు చేయడం ఆనందదాయకం
– ఇయుబి రెడ్డి, పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు, ఆంధ్రా యూనివర్సిటీ
యువత శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చెయ్యాలి ఆంధ్రా యూనివర్సిటీ పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు ఇయుబి రెడ్డి కోరారు. శనివారం ఉదయం అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో వ్యూస్ ఎన్ జిఒ, ఆస్ట్రేలియన్ కాన్సలేట్ జనరల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన యూత్ ఫర్ క్లైమేట్ చేంజ్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. విద్యార్థులందరినీ పర్యావరణ హితంగా జీవించాలి అని కోరారు. మట్టి ప్రమిదలు విద్యార్థులు తయారు చేయడం ఆనందదాయకం అన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో మొక్కలు నాటి పెంచాలని కోరారు. ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడుకోవాలని, పెద్ద పెద్ద వృక్షాలు ప్రజల ఆస్తి గా భావించి కాపాడుకోవాలి అని కోరారు. చాలా సంస్థలు శీతోష్ణస్థితి వేడెక్కకుండా, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చెయ్యాలని కోరుతూ పని చేయడానికి ముందుకు వస్తున్నాయన్నారు.
ప్రిన్సిపాల్ సునీత మాట్లాడుతూ విద్యార్థులు అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చెయ్యాలి, మాట్లాడాలి, పదిమందికీ అవగాహన కల్పించాలన్నారు. శీతోష్ణస్థితి వేడెక్కకుండా, పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ విద్యార్థుల గురుతరమైన బాధ్యతగా స్వీకరించాలని కోరారు.
వ్యూస్ సంస్థ కోఆర్డినేటర్ జె రాజేశ్వరి మాట్లాడుతూ తమ సంస్థ పర్యావరణ పరిరక్షణ కోసం విశాఖ నగరంలో పలు విద్యా సంస్థల్లో విద్యార్థులతో పని చేస్తుంది అన్నారు. శీతోష్ణస్థితి వేడెక్కకుండా యువత కృషి చేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు రామ్ అప్పారావు , వెంకట్ , ఎకో వారియర్ జెవి రత్నం, ఎన్విరాన్మెంటల్ వాలంటీర్లు జె. రవితేజ, ఐ. కృష్ణకుమారి పలువురు విద్యార్థులు మాట్లాడారు.
AKSHRA ENGLISH MEDIAM SCHOOL దీపావళి కుందులు తయారు చేయడం
57
previous post