సాంప్రదాయ బద్దంగా దిపావళి పండుగ జరుపుకుందాం.- పశు, పక్ష్యాదులకు హాని కలిగించ వద్దు.

by vvwnews.com

సాంప్రదాయ బద్దంగా దిపావళి పండుగ జరుపుకుందాం.
– పశు, పక్ష్యాదులకు హాని కలిగించ వద్దు.
– రమాదేవి, బోటనీ అధ్యాపకులు, కెడిపిఎం ఉన్నత పాఠశాల
సాంప్రదాయ బద్దంగా దివ్వెల పండుగ దిపావళి జరుపుకుందాం అని కెడిపిఎం ఉన్నత పాఠశాల బోటనీ అధ్యాపకులు రమాదేవి కోరారు. శుక్రవారం సాయంత్రం కెడిపిఎం ఉన్నత పాఠశాలలో, ఎయు తెలుగు మీడియం స్కూల్ లో గ్రీన్ క్లైమేట్ టీం, సిఫా సంస్థలు పర్యావరణ హిత దీపావళి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పశు, పక్ష్యాదులకు, వృద్దులకు, పిల్లలకూ హాని కలిగించ వద్దన్నారు. ఎకో వైజాగ్ ను జయప్రదం చేయాలని కోరారు. బాణాసంచా కాల్చి శబ్ద, వాయు, జల కాలుష్యం కాకుండా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలోగ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం, సిఫా సంస్థ ప్రతినిధులు హేమ, నర్సింగ్, ప్రసాద్ లు, ఆంధ్రా యూనివర్సిటీ సోషల్ వర్క్ విద్యార్థినులు బి ఉషారాణి, బి తేజస్విని, ఆడమ్ బి సార్, బి చైతన్య సరస్వతి, గ్రీన్ వాలంటీర్ జె రాజేశ్వరి, జె రవితేజ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Use Social Media to Spread the Word about Our News

related articles