ప్రెస్ నోట్
పోర్టు హాస్పిటల్ టెండర్ పేరుతో ఎవరు వచ్చినా అడ్డుకుంటాం
సిఐటియు అర్ధనగ్న ప్రదర్శన వినూత్న నిరసన
విశాఖపట్నం, తేదీ: 25/10/24
పోర్టు హాస్పిటల్ టెండర్‌కు ఎవరు వచ్చినా కాళ్లు పెట్టనీయం అడ్డుకుంటామని, ఈరోజు నిరసన దీక్షలో సిఐటియు నాయకులు హెచ్చరించారు. పోర్టు హాస్పిటల్‌ను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పోర్టు హాస్పిటల్ వద్ద 25వ రోజు నిరసన దీక్ష కొనసాగుతోంది.
సిఐటియు యూనియన్ గౌరవ అధ్యక్షులు వి యస్ పద్మనాభ రాజు,ఆల్ ఇండియా ఫెడరేషన్ కార్యదర్శి బి. జగన్ మాట్లాడుతూ, హాస్పిటల్ టెండర్‌కు వచ్చిన వారిని అడ్డుకోవాలని, తురిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ నిర్ణయం అనైతికమని, హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, సుమారు 40 వేల మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేట్ వారికి అప్పగించడం అనర్హమని తెలిపారు. విశాఖపట్నం పోర్టు విశాఖ అభివృద్ధికి కీలకమని, ప్రతీ ఏటా మున్సిపాలిటీకి సగటున 55 కోట్ల రూపాయలు పన్నులు కడుతున్న పోర్టును ప్రైవేట్ వారికి ఇచ్చి ధారాదాతత్వం చేయడం అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుందని అన్నారు. ఈ పోరాటంలో విశాఖ ప్రజలు, రాజకీయ పార్టీలు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
పోర్టు యాజమాన్యం వద్ద రిజర్వ్ ఫండ్లు, వేల ఎకరాల భూమి ఉన్నప్పటికీ, ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయం అన్యాయమని, ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కొనసాగితే, కార్మికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమని హెచ్చరించారు. అవసరమైతే పోర్టు చైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె. సత్యనారయణ, ఈశ్వరరావు, బి. లక్ష్మణరావు, రామలింగేశ్వర రావు, సి.హెచ్.త్రినాదరావు, కె.ఎస్ కుమార్ , శ్రీను, రాఘవులు,కెవిజయరావు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ ప్రైవేటీకరణను విరమించి, స్వాంతనిధులతో అభివృద్ధి చేయాలని యాజమాన్యాన్ని కోరారు.
ఇట్లు,
బి. జగన్
కార్యదర్శి,
సిఐటియు ఆల్ ఇండియా ఫెడరేషన్