ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ అత్యంత ఉత్సాహభరితంగా సాగుతుంది. ఆరిలోవ ఫినాకీల్ మైదానంలో ప్రతి రోజు 6 మ్యాచ్ లు చొప్పున జరుగుతున్నాయి. ఐదవరోజు మైదానంలోకి దిగిన జట్లు హోరాహోరీ గా తలపడ్డాయి. గురువారం జరిగిన మ్యాచ్ ల్లో ముందుగా అమర్ ఎరైవల్స్ వర్సెస్ డూ ఆర్ డై జట్లు తలపడగా అమర్ ఎరైవల్స్ విజయం సాధించగా అరవింద్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన చేగువేరా XI, రాంబాబు లయన్స్ జట్లు పోటీపడి ఆడగా చేగువేరా XI జట్టు విజయం సాధించి, నారాయణ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఇక ఈరోజు మూడవ రౌండ్ లో బరిలోకి దిగిన ఉపేంద్ర స్ట్రైకర్స్ వర్సెస్ డీజే జనసేన వారియర్స్ జట్లు తలపడగా ఉపేంద్ర స్ట్రైకర్స్ జట్టు విజయం సాధించింది. రెహ్మాన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఈ సందర్బంగా టోర్నమెంట్ ఆర్గనైజర్ సుధీర్ మాట్లాడుతూ ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా సాగుతుందన్నారు. 12 రోజుల పాటు జరిగే టోర్నిలో ఇప్పటికే కొన్ని జట్లు సూపర్ 8 కి అర్హత సాధించాయని తెలిపారు. ప్రతి క్రీడాకారుడుకి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరూ గేమ్ ను చూసే విధంగా మ్యాచ్ లను లైవ్ లో ప్రసారం చేస్తున్నామని తెలిపారు. క్రీడాకారుల ఆపద్బాంధవుడు కంచర్ల అచ్యుతరావు అని కొనియాడారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ రెహ్మాన్, నాగు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 ఇప్పటినుంచి సూపర్ 8 స్టార్ట్ అవుతుంది.
41