ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 #vvwnews

by vvwnews.com

ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా సాగుతుంది. ఆరిలోవ ఫినాకీల్ మైదానంలో ప్రతి రోజు నాలుగు మ్యాచ్ లు జరుగుతున్నాయి. నాలుగవ రోజు బరిలోకి దిగిన జట్లు హోరాహోరీ గా తలపడ్డాయి. బుధవారం జరిగిన మ్యాచ్ ల్లో ముందుగా SACT, ఓల్డ్ ఆరిలోవ జట్లు ఆడగా ఓల్డ్ ఆరిలోవ జట్టు SACT జట్టుపై విజయం సాధించగా, నేతాజీ వారియర్స్ వర్సెస్ డీజే ఫ్రీడమ్ వారియర్స్ జట్లలో నేతాజీ వారియర్స్ జట్టు, డీజే ఫ్రీడమ్ జట్టుపై అద్భుత విజయం సాధించింది. ఈ సందర్బంగా యూత్ లీడర్ చిన్న, నేతాజీ వారియర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శంకర్, డీజే తదితరులు మాట్లాడుతూ ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా సాగుతుందన్నారు. 12 రోజుల పాటు జరిగే టోర్నిలో 24 ఫ్రాంచైజీలు నుంచి 450 క్రీడాకారులు ఆడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడుకి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి క్రీడాకారుడు గేమ్ ను చూసే విధంగా మ్యాచ్ లను లైవ్ లో ఇస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ రెహ్మాన్, నాగు, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles