ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ హబ్ గా మారుస్తాం. అందరితో చర్చించి 15 రోజుల్లో డ్రోన్ పాలసీ ప్రకటిస్తాం.

by vvwnews.com

ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహభరితంగా సాగుతుంది. ఆరిలోవ ఫినాకీల్ మైదానంలో ప్రతి రోజు నాలుగు మ్యాచ్ లు జరుగుతున్నాయి. మూడో రోజు తలపడిన జట్లు హోరాహోరీ గా తలపడ్డాయి. మంగళవారం జరిగిన మ్యాచ్ ల్లో కంచర్ల ఎలెవన్, డిబి ఫ్రెండ్స్, డ్రీమ్స్ ఎలెవన్ జట్లు తమ ప్రత్యర్థి జట్లు పై విజయం సాధించాయి. ఈ సందర్బంగా టోర్నీ నిర్వాహకుడు సుధీర్ మాట్లాడుతూ ఉపకార్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆధ్వర్యంలో ఉపకార్ కప్-2024 సీజన్ 2 మెగా క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా సాగుతుందన్నారు . 12 రోజుల పాటు జరిగే టోర్నిలో 24 ఫ్రాంచైజీలు నుంచి 450 క్రీడాకారులు ఆడుతున్నారని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడుకి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి క్రీడాకారుడు గేమ్ ను చూసే విధంగా మ్యాచ్ లను లైవ్ లో ఇస్తున్నట్టు చెప్పారు.కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ రెహ్మాన్, నాగు, నవీన్, తదితరులు పాల్గొన్నారు

Use Social Media to Spread the Word about Our News

related articles