పారిశ్రామిక ప్రాంతం 59 వ వార్డు ఎక్స్ సర్వీస్ మేన్ కాలనీ పరిధిలో ఉన్న శాంతినగర్ బాల్యం భవనం శిథిల అవస్థలో ఉండడంతో విశాఖ ఎమ్మెల్యే గణబాబు గారు సందర్శించారు. అక్కడ స్థానికులు భవన పరిస్థితిని మరియు అక్కడ సదుపాయాల గురించి చిన్నారుల తల్లిదండ్రులు గణబాబు గారికి వివరించారు.
బాల్యం అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దానికి శాశ్వత పరిష్కారంనికి కృషి చేస్తానన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. స్థానికులు అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గణబాబు వెంటనే అంగన్వాడి సి.డి.పి.ఓ కుమారి , అసిస్టెంట్ సి.డి.ఎస్ జి శ్రీలత, సూపర్వైజర్ వరలక్ష్మి వారితో సంప్రదించారు.
ఆ ప్రాంతంలో ఉన్న రిటర్నింగ్ వాల్ రోడ్లు డ్రైనేజీలు పరిశీలించి జీవీఎంసీ అధికారులతో మాట్లాడి తొందర్లోనే పనులు పూర్తి చేయడానికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు