గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ క్యాంపస్ లోహైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్యా సదస్సు మంత్రిసీతక్క

by vvwnews.com

– గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య సదస్సు కు ముఖ్యఅతిథిగా హాజరైన పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క

– జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించిన మంత్రి సీతక్క

– సదస్సుకు హాజరైన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ములుగు కలెక్టర్ దివాకర్ టిఎస్, ప్రముఖ ngo, సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులు

ఈ సందర్భంగా
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమల శాఖ మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ

గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ఎడ్యుకేషన్ ను ప్రోత్సహించేందుకు మీరంతా సమావేశం అయినందుకు అభినందనలు

నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు

కార్పొరేట్, సాఫ్ట్వేర్ కంపెనీలు జీవోలను ఒక వేదిక మీదికి తీసుకొచ్చిన నిర్మాన్ సంస్థ ఫౌండర్ మయూర్ కి ప్రత్యేక అభినందనలు

మారుమల గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విద్యను అందించటానికి మీరంతా ముందుకు వచ్చారు

*సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే*

అందుకే విద్య అనేది చాలా ముఖ్యం

దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే

సమాజంలో ఇంకా అంతరాలు ఉన్నాయి

విద్యా బోధనలో కూడా అంతరాలు ఎక్కువగా ఉన్నాయి

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది

మైధనా ప్రాంతాల, అటవీ ప్రాంతాల మధ్య విద్య విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది

పట్టణ ప్రాంతాలకు మెరుగైన విద్య అందుతుంది

గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారు

అందుకే విద్యలో ఉన్నంతరాలను తొలగించాలి

సమానత్వ సాధన దిశలో విద్య కీలకం

హైదరాబాదులో ఎలాంటి ఎడ్యుకేషన్ వుందో, మరుమల పల్లెలో అలాంటి విద్య ఉండాలి

ఆ దిశలో మా ప్రభుత్వం కృషి చేస్తుంది

గ్రామీణ విద్యార్థులు అవకాశం కల్పిస్తే బాగా రాణిస్తారు

కానీ వారికి అవకాశాలు వస్తువులు లేపటం వల్ల వెనుకబాటుతనానికి గురవుతున్నారు

అందుకే గ్రామీణ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది

అందుకు మీ వంతు సహకారం అందించండి

సమాజంలో రెండు వర్గాలు ఉన్నాయి

ఉన్నత విద్యవంతులున్న.సమాజంలో కనీస విద్యా లేనివారు సమాజంలో ఉండటం బాధాకరం

అందుకే అంతరాలను తగ్గించే ఎందుకి మీ వంతు చేయూత ఇవ్వండి

అభివృద్ధి వీకేంద్రీకరణ జరగాలి, అప్పుడే అందరికీ సమాన అవకాశాలు అందుతాయి

అప్పుడు సమాజంలో పోరాటాలు ఉండవు

పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే మా లక్ష్యం

అభివృద్ధి వికేంద్రీకరణ జరగకపోతే వివక్షతా భావం ప్రజల్లో పెరుగుతోంది

అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు

మీకేంద్రీకరణ జరిగితేనే సమానత్వం సాధ్యపడుతుంది

అచ్చంపేట, ఆదిలాబాద్,ములుగు, భద్రాచలం వంటి అటవీ ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి మీరు ముందుకు రావడం ప్రపంచానికి ఆదర్శం

దేశమా అధిక రంగంలో దూసుకుపోతున్నా నిలువ నీడలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు

వారికి అండగా మీరు నిలిస్తే ప్రపంచమే హర్షిస్తుంది

డిజిటల్ విద్యలో ప్రభుత్వ ప్రయత్నమూ లో మీరు భాగస్వాములు కండి

మీ సి ఎస్ ఆర్ ఫండ్స్

మీరంతా గ్రామాలకు తరలండి…అటవీ గ్రామీణ పరిస్థితులను చూడండి

విద్యా వ్యవస్థ సరిగా లేనిచోట పర్యటించి ప్రణాళిక రూపొందించండి

ఆదివాసి గిరిజన ప్రాంతాల విద్య అభివృద్ధికి కృషి చేస్తే దేవుళ్ళుగా మిమ్మల్ని ఆరాధిస్తారు

నోరులేని నిస్సహాయుకులకు వద్దకు వెళ్లండి

*ఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి*

అప్పుడు మీరే మార్పుకు నాంది పలికిన వారవుతారు

మనసుంటే మార్గం ఉంటుంది

చిత్తశుద్ధి, మంచి ఆలోచనలు ఉంటే కఠిన పరిస్థితులను అధిగమించగలుగుతాం

అటవీ శాఖ అభ్యంతరం పెడితే..కంటైనర్ ఆస్పత్రి, కంటైనర్ స్కూల్ ను ఏర్పాటు చేశారు

ఒక మంచి పని చేస్తే జీవితంలో గొప్ప ఆనందం అనుభూతి మిగులుతుంది

పుట్టుకకు చావుకు మధ్య ఉన్న సమయాన్ని సమాజ మార్పు కోసం వెచ్చించాలి

చుట్టూ ఉన్న పల్లెను అభివృద్ధి చేస్తే ఆనందమే వేరు

ములుగు ఎన్నో ప్రత్యేకతలకు వేదిక ..అందరూ పర్యటించండి

ఏసి గదిలో పనిచేసే మీరు అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోవాలి

ప్రకృతిని స్వచ్ఛమైన గాలిని ఆస్వాదిస్తే మీ ఆయుష్షు 30% పెరుగుతుంది

ములుగుకి వచ్చి డిజిటల్ విద్య బలోపేతానికి కృషి చేయండి

Use Social Media to Spread the Word about Our News

related articles